భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
శ్రీలంక సర్కారు ఇంధన ధరలను భారీగా పెంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న నేమథ్యం మార్చి 10, 2026 అర్ధరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. గత వారం రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పదే పదే హామీ ఇచ్చినప్పటికీ.. తాజాగా ధరలను పెంచడం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని హామీ ఇచ్చి కూడా తాజాగా ధరలను పెంచడం గమనార్హం.
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం
ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అకస్మాత్తుగా పెరగడమే. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 115 డాలర్ల మార్కును దాటి సుమారు 20 శాతానికి పైగా పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం, ఇంధన ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను దెబ్బతీసింది. దీని ఫలితంగా చమురు దిగుమతులపై ఆధారపడే శ్రీలంక వంటి దేశాలకు ధరల భారం తప్పలేదు.

ప్రజల్లో పెరిగిన ఆందోళన
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు జరిగినప్పటి నుంచి శ్రీలంకలో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడింది. ప్రభుత్వం అప్పట్లో 27 రోజులకు సరిపడా పెట్రోల్, 33 రోజులకు సరిపడా డీజిల్ నిల్వలు ఉన్నాయని హామీ ఇచ్చినా ధరలు పెరగడంతో సామాన్యుడిపై ఆర్థిక భారం పెరిగింది. ఈ పెరుగుదల రవాణా రంగాన్ని మాత్రమే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్త ధరల వివరాలు (లీటరుకు):
*పెట్రోల్ 92 ఆక్టేన్: రూ. 317 (రూ. 24 పెంపు)
*పెట్రోల్ 95 ఆక్టేన్: రూ. 365 (రూ. 25 పెంపు)
*డీజిల్: రూ. 303 (రూ. 22 పెంపు)
*యూరో 4 డీజిల్: రూ. 353 (రూ. 24 పెంపు)
*కిరోసిన్: రూ. 195 (రూ. 13 పెంపు)
సాధారణంగా నెలకోసారి ధరలను సవరించే శ్రీలంక ప్రభుత్వం.. ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల దృష్ట్యా అనివార్యంగా ధరలను సవరించాల్సి వచ్చింది. నిన్నటి వరకు ఆందోళనలో ఉన్న ప్రజలు, ఇప్పుడు పెరిగిన ధరల భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
-
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
తాడో పేడో: యుద్ధం ఆపే ప్రసక్తే లేదు- ట్రంప్ కు నెతన్యాహు అర్జంట్ ఫోన్ కాల్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం..












Click it and Unblock the Notifications