వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక ప్రధాని రాజీనామా.. నిరసనల హోరు, తలొగ్గిన విక్రమసింఘే

|
Google Oneindia TeluguNews

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పీక్‌క్ చేరింది. ద్రవ్యోల్బణం వల్ల కూడా ఆ దేశంలో ప్రజలు ఆందోళనకు దిగారు. పెట్రో, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు అధ్యక్షుడు ఇంటిలోకి వెళ్లి నిరసన తెలిపారు. నిరసనలు హోరెత్తుతున్న వేళ ప్రధాని విక్రమసింఘే కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో విక్రమసింఘే తన నిర్ణయాన్ని తెలియజేశారు. శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో.. విక్రమసింఘే పదవీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు రాజపక్సే కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇంటి వద్ద కూడా నిరసనలు మిన్నంటాయి.

sri lanka pm Ranil Wickremesinghe resign

అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసాన్ని ముట్టడించారు. ఆందోళనకారులు నివాసంలోకి చొరబడ్డారు. ఇంటి లోపలి భాగంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో కొందరు నిరసనకారులు ఈతకొట్టారు. మరికొందరు ఇంట్లోని గదుల్లో ఉన్న ఫర్నిచర్‌పై కూర్చొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తు్నాయి.

వీధుల్లోకి వచ్చిన లంక ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్జేబీ ఎంపీ రజిత సేనారత్నేపై ఆందోళనకారులు దాడికి పాల్పడారు. సంక్షోభం మరింత ముదిరిన నేపథ్యంలో శ్రీలంకలో జులై 15 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
sri lanka prime minister Ranil Wickremesinghe resign amid protests
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X