వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీభ్సతం సృష్టించిన సూపర్ టైఫూన్.. 23 మంది మృతి.. అల‌మటిస్తున్న ఫిలిప్పీన్స్ ప్రజలు

|
Google Oneindia TeluguNews

ఫిలిప్పీన్స్‌లో రామ్ టైఫూన్ తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో ఇప్పటికే దక్షిణి, మధ్య ప్రాంతాలు పూర్తి దెబ్బతిన్నాయి. ఈ రాకాసి తుపానుతో 23 మంది మృతి చెందారు. లక్ష‌లాది మంది ప్రజలు నిరాశ్రాయులయ్యారు . దాదాపు మూడు లక్ష‌ల‌ మందికి పై తమ ఇళ్లను, రిసార్ట్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. వేల కోట్ల ఆస్థిన‌ష్టం సంభ‌వించింది.

రాయ్ టైపూన్ విద్వంసం..

రాయ్ టైపూన్ విద్వంసం..


ప‌ర్యాట‌క దేశం ఫిలిప్పిన్స్‌లో రాయ్ టైపూన్ సృష్టించిన‌ విద్వంసానికి అనేక అనేక ప్రాంతాలలో జనజీవనం స్థంభించింది. గంటకు 125 మైళ్ల వేగంతో కూడిన గాలులు వీయడంతో కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. విద్యుత్ స్థంబాలు నెలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం నెలకొంది . భారీగా వరదలు ముంచేత్తడంతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఊళ్లకు ఊళ్ళు నీటి మునిగిపోయాయి. ఎటూచూసినా నీళ్లే కనిపించడంతో రాకపోకలు పూర్తిగా నిలిపోయాయి.

ప‌ర్యాట‌క ద్వీపాలు క‌నుమ‌రుగు

ప‌ర్యాట‌క ద్వీపాలు క‌నుమ‌రుగు

వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 18వేల మందిపైగా మిలటరీ, పోలీసులు, కోస్ట్ గార్డు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని ఫిలిప్పీన్స్ జాతీయ విపత్తు ఏజెన్సీ ప్రతినిధి మార్క్ టింబాల్ తెలిపారు. రోడ్లపై పడిన చెట్టు, కొమ్మలు, శిధిలాలను తొలగిస్తున్నారు. వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. స‌ర్వ‌స్వం కోల్పియిన బాధితుల‌కు పున‌రావాసం ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ముఖ్యంగా అన్ని ప్రాంతాల కంటే సురిగావ్, సియార్ గావ లలో తీవ్రమైన నష్టం జరిగిందని మార్క టింబాల్ చెప్పారు. సియార్ గావ్ సమీపంలోని ఒక ద్వీపం నాశనమైందని పేర్కొంది . అలాగే ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పలావాన్ ద్వీపాన్ని ఈ రాకాసి తుపాను దాటికి పూర్తిగా విద్వంసమైంది.

ఈ ద‌శాబ్దంలో అత్యంత శ‌క్తివంత‌మైన తుపాను

ఈ ద‌శాబ్దంలో అత్యంత శ‌క్తివంత‌మైన తుపాను

ఇలాంటి తుపాను 1980లో సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ దశాబ్ధంలో ఫిలిప్పిన్స్ విరుచుకుపడిన తుపానులలో ఇది అంత్యంత భయంకరమైన తుపాను అని తెలిపారు. విసాయా, పలావాన్ దీవుల ప్రాంతాల‌లో ఉన్న సుమారు 3 ల‌క్ష‌ల‌మందిని సుర‌క్షిత‌ ప్రాంతాలకు తరలించారు. చాలా ప్రాంతాల్లో నీళ్లు ఆహారం లేక ప్రజలు అల్లాడుతున్నారు. మరో వైపు ఈ తుపాను ప్రభావం కోటి 30 లక్ష‌ల‌ మందిపై పడిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు

ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు


రామ్ టైపూన్ తుపాను కార‌ణంగా ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేశారు. ప్ర‌ధాన ఓడ‌రేవులు , విమానాశ్రయాల‌ను మూసివేశారు. ప‌సిపిక్ మ‌హాస‌ముద్ర ప‌రిస‌ర‌ప్రాంతాల్లో నివ‌సించే వారిని అప్ర‌మ‌త్తం చేశారు. స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా ఉంటుంద‌ని , మ‌త్స్య‌కారులు చేప‌ల వేట‌కు వెళ్లరాద‌ని ప్ర‌భుత్వం హెచ్చిరించింది. గంట‌ల‌కు 195 కి.మీ వేగంతో బ‌ల‌మైన గాలుల‌తో పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయని తెలిపింది.

English summary
Strongest rai typhoon hits in philippines ..23 killed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X