‘ఐఫోన్ ఎక్స్’ తో ఆపిల్ కంపెనీ ఆదాయమెంతో తెలుసా?

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఆపిల్ ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉంటుందో మనకు తెలిసిన విషయమే. ఎన్ని మోడళ్లు వస్తున్నా కొత్త మోడల్‌ కోసం ఎదురుచూస్తుంటారు ఐఫోన్ వినియోగదారులు.

కొత్త మోడల్ ఐఫోన్‌ విడుదలైందంటే చాలు.. ధర ఎంతైనా సరే, హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. తాజాగా ఆపిల్‌ కంపెనీ ఐఫోన్‌ ఎక్స్(టెన్) ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

పదో వార్షికోత్సవం సందర్భంగా...

పదో వార్షికోత్సవం సందర్భంగా...

ఐఫోన్‌ పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ కొత్త మోడల్ ఫోన్‌తో ఆపిల్‌ బాగానే లాభపడిందట. మిగత మోడళ్లతో పోలిస్తే.. ఐఫోన్‌ ఎక్స్ ధర కాస్త ఎక్కువే, అయినా డిమాండ్‌ తగ్గలేదు. ఐఫోన్‌ ఎక్స్ లో 5.8 అంగుళాల ఎడ్జ్‌ టు ఎడ్జ్‌ డిస్‌ప్లే ఉంటుంది. గత మోడళ్లతో పోలిస్తే ఇందులో డిస్‌ప్లే కోసం ఆపిల్‌ రెట్టింపు ఖర్చు చేసినట్లు టెక్‌ఇన్‌సైట్స్‌ పేర్కొంది.

లాభాల పంటే...

లాభాల పంటే...

ఇంతకుముందు విడుదల చేసిన ఐఫోన్‌ 6, 7, 8లపై కూడా కంపెనీకి లాభాలొచ్చినా.. వాటితో పోలిస్తే ఐఫోన్‌ ఎక్స్ ఆ కంపెనీకి లాభాల పంట పండించింది. అధునాతన టెక్నాలజీతో ఫోన్‌ను తీసుకురావడమే ఇందుకు కారణం.

25 శాతం అధికంగా ఖర్చు పెట్టి...

25 శాతం అధికంగా ఖర్చు పెట్టి...

ఐఫోన్‌ 8 కంటే 25శాతం ఎక్కువ ఖర్చు పెట్టి ఐఫోన్‌ ఎక్స్ ను తయారుచేసింది ఆపిల్‌. ఒక్కో ఐఫోన్‌ ఎక్స్ ను తయారుచేసేందుకు ఆ కంపెనీకి అయిన ఖర్చు 357.50 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.23,200).

ఒక్కో ఐఫోన్ ఎక్స్ పై...

ఒక్కో ఐఫోన్ ఎక్స్ పై...

అయితే ఐఫోన్‌ టెన్‌ మార్కెట్‌ ధర మాత్రం 999 డాలర్లు (భారత కరెన్సీలో రూ. 64,800). అంటే ఒక్కో ఫోన్‌పైన యాపిల్‌కు 64 శాతం లాభం అన్నమాట. టెక్నాలజీ పరికరాలను విశ్లేషించే టెక్‌ఇన్‌సైట్స్‌ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Apple Inc's new flagship iPhone X makes the company more money per phone than its iPhone 8 model, according to an analysis, which found the iPhone X's flashier parts cost Apple 25 percent more than the iPhone 8, but that it retailed 43 percent higher.The iPhone X smartphone costs $357.50 to make and sells for $999, giving it a gross margin of 64 percent, according to TechInsights, a firm that tears down technology devices and analyses the parts inside. The iPhone 8 sells for $699 and has a gross margin of 59 percent. The finding is surprising because technology products tend to become more profitable as they age and the parts for them drop in cost.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి