అత్యధికమంది భారతీయులు నివసిస్తున్న దేశాలు ఇవే..!
విద్య.. ఉపాధి నిమిత్తం భారత్ నుంచి ఏటా లక్షలాది మంది యువత, ఉద్యోగులు విదేశాలకు వెళ్తుంటారు. ఇటీవలి కాలంలో భారత్ నుంచి విదేశాలకు వెళ్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, బ్రిటన్ లకు వెళ్లి నాలుగురాళ్లు వెనకేసుకోవాలని అందరూ చూస్తుంటారు. అయితే అత్యధికమంది భారతీయులు నివసిస్తున్న టాప్ 10 దేశాలు ఓసారి పరిశీలిస్తే.. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏటేటా ఈ లెక్కలు మారుతూ ఉంటాయి.
ఇక ప్రస్తుతం భారతీయులు అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా టాప్ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం అమెరికాలో 55 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఉన్నత చదువులు, ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వలస వెళ్తుంటారు. ఇక రెండోస్థానంలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. యూఏఈలో 35 లక్షల 68 వేల మంది ఉన్నారు. ఇక మూడోస్థానంలో మలేషియా ఉంది. మలేషియాలో ప్రస్తుతం 29 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇక కెనడా ఈ లిస్టులో నాలుగో స్థానంలో ఉంది. కెనడాలో 28 లక్షల 75 వేల మంది ఉన్నారు.
ఇక సౌదీ అరేబియా ఈ లిస్టులో 24 లక్షల 63 వేల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. మయన్మార్ లో 20 లక్షల భారతీయులు నివాసం ఉంటున్నారు. ఇక యూకేలో 18 లక్షల మంది నివాసం ఉంటున్నారు. వృత్తి, ఉపాధి, ఉద్యోగ రిత్యా ఈ దేశంలో నివాసం ఉంటున్నారు. అలాగే సౌత్ ఆఫ్రికాలో 17 లక్షలమంది భారతీయులు ఉన్నారు.

ఇక శ్రీలంక లో 16 లక్షల మంది భారతీయులు ఉండగా.. కువైట్ లో 9 లక్షల 95 వేల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. అలాగే ఆస్ట్రేలియాలో 9 లక్షల 76 వేల మంది.. మారిషస్ లో 8 లక్షల మంది .. ఖతార్ లో 8 లక్షల 36 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. నేపాల్ లో 7 లక్షల మంది.. ఒమన్ లో 6 లక్షలు, సింగపూర్ లో 6 లక్షలు, న్యూజిలాండ్ లో 2 లక్షలు, ఫ్రాన్స్ లో 1 లక్ష మంది.. అత్యల్పంగా ఇజ్రాయెల్ లో లక్షా 5 వేల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు.
-
మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ సంస్థల్ని బూడిద చేస్తాం: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications