ఘోర ప్రమాదం: లోయలో పడిన రైలు, 33మంది మృతి
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధనం తీసుకెళ్తున్న ఓ రైలు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది దుర్మరణం చెందారు.
లుబుంబాషి: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధనం తీసుకెళ్తున్న ఓ రైలు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది దుర్మరణం చెందారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 13 ఆయిల్ ట్యాంకర్లతో ఓ రైలు లుబుంబాషి నుంచి కటంగాలోని లుయేనా వెళ్తొంది. లుబుడి స్టేషన్ సమీపంలో ఈ రైలు అదుపుతప్పి లోయలో పడింది. రైల్లో ఆయిల్ ట్యాంకర్లు ఉండటంతో వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.దీంతో 33 మంది మృతి చెందారు.

సమాచారమందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. కాగా, మృతులంతా ఆ రైల్లో అక్రమంగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోందని ఓసీనియర్ అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications