వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video:శ్వేతవర్ణ మయూరం.. తన్మయత్వానికి గురిచేసిన నెమలి, మీరు చూడండి..

|
Google Oneindia TeluguNews

మయూరం.. మన జాతీయ పక్షి. అదేంటో నెమలిని చూడగానే అదో ఉత్సాహం.. ఒకరకమైన ఫీలింగ్ కలుగుతుంది. నెమళ్లు దాదాపుగా నీలి రంగులోనే ఉంటాయి. తెల్లని మయూరం ఉంటాయి.. కానీ రేర్. ఎప్పుడో.. ఎక్కడో ఒకటి అరా కనిపిస్తుంటాయి. అయితే వాటిని కొందరు వీడియో తీసి షేర్ చేయడంతో ప్రపంచం చూస్తోంది. అలా ఇటలీలో శ్వేతవర్ణ మయూరం తలుక్కుమంది. ఆ వీడియోను ట్వీట్ చేయగా.. నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేశారు.

ప్రపంచంలో అందమైన పక్షులు నెమళ్లు. అందుకు గల కారణం కూడా ఉంది. దాని ఈక.. ఫ్యాన్ మాదిరిగా ఉండే తోక, పొడవాటి తోకతో అందంగా ఉంటుంది. చిన్నారులు అయితే తెగ ముచ్చటపడుతారు. నిజానికి నెమలిని చూసి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇంప్రెస్ అవుతారు. అలాంటి తెల్లని మయూరం ఇటలీలో కనిపించింది. అదీ విగ్రహాం నుంచి పచ్చికబయళ్లపైకి వస్తోండగా ఒకరు వీడియో తీశారు. దానిని యోడఫరెవర్ ట్వీట్ చేసింది. దానికి వైట్ పీకాక్ ఇన్ ప్లైట్ అనే క్యాప్షన్ పెట్టింది.

White Peacock Caught Flying In Italy..

ఇటలీలో గల స్ట్రెస్సా సమీపంలో గల మగ్గిరో లేక్ వద్ద గల బారొమిన్ ద్వీపంలో మయూరం కనిపించింది. ఇక్కడ తెల్లని మయూరాలే కాదు.. నీలి రంగు నెమళ్లు కూడా కనిపిస్తుంటాయి. సరస్సులో బొరొమిన్ ద్వీపం స్వర్గం లాంటిదని చెబుతుంటారు. తెల్లని నెమలికి సంబంధించి వీడియో షేర్ చేయగా.. తెగ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే 21 వేల లైకులు.. 2.5 లక్షల వ్యూస్ వచ్చాయి. పలువురు కామెంట్స్ కూడా చేశారు.

తెల్లని నెమలి చూడ ముచ్చటగా ఉందని ఒక యూజర్ కామెంట్ చేశారు. చాలా అందంగా ఉందని ముచ్చటపడ్డారు. పదేళ్ల క్రితం ఇలాంటి నెమలి చూశానని మరొకరు కామెంట్ చేశారు. కానీ ఎగరడం మాత్రం చూడలేదని చెప్పారు. ఇప్పుడు చూసి తన్మయత్వానికి లోనవుతున్నానని పేర్కొన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా కామెంట్ చేశారు.

నీలి రంగు నెమళ్ల ఉప జాతే తెల్లిన మయూరాలు. ఇవీ పసుపురుంగలో జన్మిస్తాయట. పెరిగే కొద్దీ తెల్లగా మారుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తర్వాత ఈకలు, తోకకు కలర్ మారుతూ.. శ్వేతవర్ణంలో మారుతుందట.. నీలి రంగు నెమళ్లే ముచ్చటగా ఉంటాయి. ఇక తెల్లని రంగు నెమళ్ల గురించి చెప్పక్కర్లేదు. అందరూ చూసి తన్మయత్వానికి గురి కావాల్సిందే. మీరు కూడా ఒకసారి చూసి ఆ అనుభూతిని సొంతం చేసుకొండి.

English summary
video is going viral where a rare white peacock can be seen flying down to the grass from a statue on top.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X