వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ భూకంపం: చరిత్రలో 5 భయంకర విషాదాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నేపాల్‌లో ఈ నెల 25వ తారీఖున వచ్చిన భూకంపం ఎన్నటికీ మరిచిపోలేని విషాద సంఘటన. ఈ ఘటనలో దాదాపు పదివేల మంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. యావత్ ప్రపంచాన్ని ఇది కదిలించింది. నేపాల్ తరహా ఐదు ప్రపంచ ఘోర విపత్తులు...

సిసిలీ, ఇటలీ: 1963లో సిసిలీలో వచ్చిన భూకంపం అత్యంత ప్రమాదకరమైనదిగా చెబుతారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 11గా నమోదయింది. ఈ భూకంపం తర్వాత సునామీ కబలించింది. ఈ సంఘటన 70 నగరాలను తుడిచి పెట్టేసింది. దాదాపు 60వేల మంది ప్రజలు చనిపోయారు. కెటేనియాలో మూడో వంతు జనాబా తుడిచిపెట్టుకుపోయింది.

Nepal Earthquake

రుద్బార్, ఇరాన్: 1990లో భారీ భూకంపం వచ్చింది. రాశి అనే ప్రాంతం చుట్టూ వంద కిలోమీటర్లకు పైగా, తెహ్రాన్ వాయువ్య ప్రాంతంలో రెండు వందల కిలోమీటర్లకు పైగా దీని ప్రభావం పడింది. 700 గ్రామాలు చెల్లాచెదురయ్యాయి. 40వేల మంది మృతి చెందారు. 60వేల మందికి పైగా గాయపడ్డారు. ఐదు లక్షల మందికి ఇల్లు నీడ లేకుండా పోయింది.

ఇజ్మిత్, టర్కీ: 1990లో రిక్టర్ స్కేల్ పైన 7.9గా నమోదయింది. ఇది కేవలం 3.9 సెకండ్లు మాత్రమే వచ్చింది. కానీ నష్టం మాత్రం ఊహించని విధంగా జరిగింది. ఇజ్మిత్ నగరంలో 17,127 మంది చనిపోయారు. 43,959 మంది గాయపడ్డారు. అయితే, ఇంత కంటే ఎక్కువే నష్టం ఉంటుందని అంచనా వేశారు. దాదాపు 45వేల మంది చనిపోయి ఉంటారని ఊహాగానాలు వినిపించాయి.

నంకాయిడో, జపాన్: 1498 సెప్టెంబర్ 20వ తేదీన 8.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ఘటనలో 26వేల నుండి 31వేల మధ్య జనాలు చనిపోయారు. ఇల్లు, భవనాలు, చారిత్రక కట్టడాలు కూలిపోయాయి.

ఖాట్మాండు, నేపాల్: నేపాల్లో 2015, 25, ఏప్రిల్‌న 7.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదువేలకు పైగా మృతి చెందినట్లు చెబుతున్నారు. అయితే, పదివేల వరకు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎందరో పర్వతారోహకులు మృతి చెందారు. చారిత్రక ధరహార స్థూపం కుప్పకూలింది. పురాతన ఆలయాలు, చారిత్రక సంపద మట్టిలో కలిసింది.

English summary
The loss of life and property in the Nepal earthquake on April 25 is unforgettable and will certainly leave an indelible mark in the psyche of human kind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X