కనురెప్పే కాటేసింది.. ట్వీన్స్‌పై మేనమామ లైంగికదాడి.. ఎక్కడ అంటే
ఇటీవల లైంగికదాడులు ఎక్కువ జరుగుతున్నాయి. దగ్గరివారే దారుణాలకు పాల్పడుతున్నారు. నమ్మించి నయవంచన చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అలాంటి ఘటన వెలుగుచూసింది. పేరంట్స్ లేని పిల్లలను చేరదీసిన మేనమామ వారిపై కన్నేశాడు. తోబుట్టువు బిడ్డలనీ కూడా చూడకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

నీచతినీచం
తండ్రిగా మెలగాల్సిన అతడు.. నీచానికి ఒడిగట్టాడు. 63 ఏళ్ల వయస్సులో కూడా మంచి చెడు చూడలేదు. కామాంధుడిలా మారి ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. కొన్ని రోజుల నుంచి ఈ ఘోరం జరుగుతుంది. ఏం చేయాలో తెలియక ఆ బాలికలు బాధను దిగమింగుకొని భరిస్తూ వచ్చారు. ఆ నీచుడి చేష్టలు మితిమీరడంతో అక్కాచెల్లెల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అక్కాచెల్లెళ్లపై లైంగికదాడి
భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెల్లకు 12 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు చనిపోయారు. వారిద్దరూ కవలలు. అయితే ఆ బాలికలకు తాను అండగా ఉంటానని, మేనమామ మల్‌రెడ్డి కృష్ణారెడ్డి చేరదీశాడు. ఆ చిన్నారులు కూడా తమ మేనమామే కదా అని ధైర్యంగా అతడితో వెళ్లారు. కానీ వారు ఎదిగిన తర్వాత అతడి బుద్ధి బయటపడింది. కామాంధుడిలా మారి ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఎదురు తిరిగి
వేధింపులు భరించలేక అక్కాచెల్లెళ్లిద్దరూ ఎదురు తిరగడంతో.. వారిపై మేనమామ కృష్ణారెడ్డి చేయి చేసుకున్నాడు. విషయం బయటకు చెప్తే ఆస్తి మొత్తం తీసుకుని చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో తమను కామాంధుడి చెర నుంచి రక్షించాలని అక్కాచెల్లెళ్లు కొత్తగూడెం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ బాలికలను చూస్తేనే బాధ అనిపిస్తోంది. కానీ ఆ నీచుడు మాత్రం మనసు లేకుండా వ్యవహరించాడు.

లైంగికవాంఛ
మేనమామ అని ఉంటే.. వేధించాడు. లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. తన బిడ్డలు అని మాత్రం అనుకోలేదు. అంతేకాదు ఆస్తి కూడా ఇవ్వనని చెప్పడంతో భయపడిపోయారు. పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలని కోరడంతో.. ఎస్పీ రంగంలోకి దిగారు. పోలీసుల చేత విచారణకు జరిపించాలని ఆదేశించారు. వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో యువత కాస్త రిలాక్స్‌గా ఉన్నారు.