టి-కాంగ్రెస్‌కు ఝలక్! టీఆర్ఎస్‌లోకి జంప్ చేయనున్న ఎమ్మెల్యే? హరీష్ రావు మంత్రాంగం ఫలిస్తుందా?
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డితోపాటు మరికొంతమంది తెలుగుదేశం నేతలను చేర్చుకుని.. పర్వాలేదు, తెలంగాణలో పుంజుకుంటున్నాం అనే ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చే విషయమే ఇది.
హైదరాబాద్: టీటీడీపీ నేత రేవంత్ రెడ్డితోపాటు మరికొంతమంది తెలుగుదేశం నేతలను చేర్చుకుని.. పర్వాలేదు, తెలంగాణలో పుంజుకుంటున్నాం అనే ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చే విషయమే ఇది.
ఎందుకంటే, తెలంగాణలో ఆ పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే త్వరలో టీఆర్ఎస్ లోకి జంప్ చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి అధికార తెలంగాణలో చేరిన సంగతి తెలిసిందే.
ఈసారి జంప్ చేయబోయేది అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అని చెప్పుకుంటున్నారు. సంపత్ ను టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు మంత్రి హరీష్ రావు మంత్రాంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సొంత పార్టీ విషయంలో సంపత్ కుమార్ పలుమార్లు తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా ఆయన కాంగ్రెస్ ను వీడడానికి సూచనే అని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది!
తాజాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను మంత్రి హరీష్ పక్కకు తీసుకెళ్లి దాదాపు ఇరవై నిమిషాలు చర్చలు జరిపారని, ఇదంతా సంపత్ కుమార్ ను టీఆర్ఎస్ లోకి చేర్చుకోవడానికే అని సమాచారం.
సంపత్ కుమార్ కొంతకాలంగా హరీష్ రావుకు టచ్ లో ఉన్నారని, ఇప్పుడు జరుగుతున్నవి అంతిమ చర్చలు మాత్రమేనని, వివిధ భరోసాలు ఇచ్చి ఆయన్ని టీఆర్ఎస్ లోకి లాగే ప్రయత్నాలు ఊపందుకున్నాయని తెలుస్తోంది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications