అన్నీ అక్రమాలే: హెచ్‌సీఏపై అజహరుద్దీన్ నిప్పులు: వివేక్‌పైనా

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)పై టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హెచ్‌సీఏ పాలక వర్గం హక్కులను ఉల్లంఘిస్తోందని అన్నారు. చదువుకున్న వ్యక్తులే ఇలా వ్యవహరించడం బాధాకరమని అన్నారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోథా కమిటీ సిఫార్సులను హెచ్‌సీఏ అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరిపించాలని అజహరుద్దీన్ డిమాండ్ చేశారు.

 పక్క దారిపట్టిస్తోంది..

పక్క దారిపట్టిస్తోంది..

‘నేను రాజకీయంగా ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశానని.. క్రికెటర్‌గా యూపీ నుంచి రిజిస్ట్రర్ ఎలా చేసుకుంటాను' అని అజహరుద్దీన్ ప్రశ్నించారు. హెచ్‌సీఏ అందరినీ పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.

నిబంధనలకు విరుద్ధంగా..

నిబంధనలకు విరుద్ధంగా..

గ్రామీణ క్రీడాకారులకు హెచ్‌సీఏ అవకాశం ఇవ్వడం లేదని, జిల్లా, రూరల్ ప్రాంతాల నుంచి కూడా మంచి క్రీడాకారులు ఉన్నారని చెప్పారు. హెచ్‌సీఏ నిర్వహించే టీ20లీగ్ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని అన్నారు. ఆ లీగ్‌కు వివేక్ తన తండ్రి పేరు పెట్టడంపై అందరి ఆమోదం తీసుకోలేదని అజహరుద్దీన్ చెప్పారు.

 హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా..

హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా..

హెచ్‌సీఏ లోగోతో వివేక్ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20లీగ్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అజహరుద్దీన్ స్పష్టం చేశారు. ఇక బీసీసీఐ నుంచి తనకు క్లియరెన్స్ రాలేదని ఆరోపిస్తున్నారని, కానీ తనకు హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై బీసీసీఐకి నివేదిక పంపినట్లు తెలిపారు.

వివేక్ తప్పు చేశారు..

వివేక్ తప్పు చేశారు..

కోర్టు ఆదేశాలను బయటకు రానీయకుండా హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ తప్పు చేశారని అన్నారు. దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్తానని అజహరుద్దీన్ తెలిపారు. హెచ్‌సీఏ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తనకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే, తనను ఓ సెలబ్రిటీగా అందరూ ఆహ్వానిస్తారని అన్నారు. కాగా, అజహరుద్దీన్.. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీసీఐ తాజాగా అనుమతిచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former India captain Mohammad Azharuddin demanded fresh elections to the Hyderabad Cricket Association.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి