బ్యూటీషీయన్ జ్యోతి అనుమానాస్పద మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాద్‌లోని లింగంపల్లిలో బ్యూటీషీయన్‌గా పనిచేస్తున్న బ్యూటీషీయన్ జ్యోతి అనుమానాస్పదస్థితిలో వికారాబాద్ జిల్లాలో మృతి చెందింది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళేందుకు బయలుదేరిన జ్యోతి శవమై కన్పించడం కలకలం రేపుతోంది.

హైద్రాబాద్‌లోని లింగంపల్లికి చెందిన బ్యూటీషీయన్‌గా పనిచేస్తున్న జ్యోతి వికారాబాద్ జిల్లా తాండూరులోని అమ్మమ్మ ఇంటికి వెళ్ళేందుకు బయలుదేరింది. లింగంపల్లిలోని గ్రీన్‌ట్రెండ్స్‌లో బ్యూటీషీయన్‌గా పనిచేస్తుంది జ్యోతి.

beautician sucipious death in Vikarabad

అమ్మమ్మ ఇంటికని వెళ్ళిన జ్యోతి వికారాబాద్‌లో శవమై కన్పించడం పట్ల కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే జ్యోతి మొబైల్ ఫోన్ మైలారంలో దొరకడం పట్ల వారు తమ అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపిస్తున్నారు.

ధరూర్ మండలం మైలారం రైల్వేస్టేషన్లో జ్యోతి మృతదేహం కన్పించింది. సోమవారం ఉదయం రైల్వే సిబ్బంది ఆమె మృతదేహన్ని గుర్తించారు. అయితే జ్యోతి ఎలా మృతి చెందిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

తమ కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లింగంపల్లి రైల్వేస్టేషన్‌లోని సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Beautician Jyothi supicious death in Vikarabad district on Sunday. Jyothi dead body was found in mylaram railway station Monday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి