మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.. పూర్తి వివరాలు ఇవిగో..
మేడారం జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో రెండేళ్లకోసారి జరిగే ఈ గిరిజన పండుగకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. ఈ పండుగ భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది. అంతేకాక మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చరిత్రలో నిలిచింది. అయితే 2026 జనవరి చివరి వారంలో మేడారం జాతర జరగనుంది. అయితే మేడారం జాతర సందర్భంగా ముందస్తు ముక్కులు చెల్లించుకున్న భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.
ఈ నెల 16 నుంచి హనుమకొండ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులను నడిపించేలా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హనుమకొండ బస్ స్టాండ్ నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటల 10 నిమిషాలకు తొలి బస్సు ప్రారంభం కానుంది. 7గంటలు, 8 గంటలు, 9 గంటలు.. అలాగే మధ్యాహ్నం 12:10 గంటలు, 1:00 గంట, 1:40, 14:30.. తిరిగి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మేడారానికి బస్సులు బయల్దేరనున్నాయి. అలాగే మేడారం నుంచి తొలి బస్సు ఉదయం 5:45 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఆ తర్వాత 9:45, 10:15, 11:15, మధ్యాహ్నం 1:10, సాయంత్రం 4:00, 5:00, 5:30, 6:00 గంటలకు బస్సులను హన్మకొండకు నడిపేలా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలవుతున్న నేపథ్యంలో ఈ పథకంలో భాగంగా ఎక్స్ ప్రెస్ పల్లె వెలుగు బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉంది. ఇక 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. ఈ క్రమంలో ముందుగా వన దేవతలను దర్శించుకునే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే పల్లె వెలుగు ఛార్జీలు పెద్దలకైతే రూ.130, పిల్లలకు రూ.80గా నిర్ణయించినట్లు తెలిపారు. ఎక్స్ ప్రెస్ అయితే పెద్దలకు రూ.180.. పిల్లలకు రూ.110గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications