మామూలోడు కాదు.. స్కెచ్ వేస్తే అంతే?: కేబీఆర్ పార్కులో అడ్డంగా దొరికిపోయాడు..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈజీ మనీ కోసం అలవాటుపడ్డ ఓ యువకుడు అందుకోసం చైన్ స్నాచింగ్ మార్గాన్ని ఎంచుకున్నాడు. నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్కును ఇందుకోసం టార్గెట్ చేసుకుని.. 12ఏళ్లుగా స్నాచింగ్ లకు పాల్పడుతూ వస్తున్నాడు.

అయితే ఏ చిన్న క్లూ లేకుండా అతను జాగ్రత్త పడుతుండటంతో పోలీసులకు అతన్ని పట్టుకోవడం పెద్ద సవాలే అయింది. ఇటీవలే పోలీసులు అతని ఆగడాలకు చెక్ పెట్టడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జల్సాల కోసమే అతను స్నాచింగ్ లకు పాల్పడుతున్నాడని, దీనికి అతని తల్లి కూడా సహకరించిందని పోలీసుల విచారణలో తేలడం గమనార్హం.

పేరు మార్చేశాడు.. 'రిషి':

పేరు మార్చేశాడు.. 'రిషి':

స్నాచర్ నర్సింహ తన పేరును రిషిగా మార్చుకున్నాడు. నర్సింహ అనే పేరు మోటుగా ఉందని, అమ్మాయిల వద్ద 'రిషి' అని పరిచయం చేసుకునేవాడు. ఇతనికి ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దసరాకు ఎక్కడికైనా టూర్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్న నర్సింహ.. ఇందుకోసం మరోసారి కేబీఆర్ పార్కులో చైన్ స్నాచింగ్ చేయాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే అక్కడికెళ్లాడు కానీ అడ్డంగా పోలీసులకు బుక్కయ్యాడు.

రెండు నెలలకొకసారి:

రెండు నెలలకొకసారి:

ప్రతీ రెండు నెలలకొకసారి నర్సింహ కేబీఆర్ పార్కులో స్నాచింగ్ లకు పాల్పడుతుండేవాడని.. జీహెచ్ఎంసీ వాక్ వేకు వచ్చే ప్రేమ జంటలను బెదిరించి వారి నుంచి నగదు, నగలు దొంగలించేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కార్మిక నగర్ లో నివసించే నర్సింహ.. చోరీ నగలను తల్లికే ఇచ్చేవాడని, ఆమే వాటిని విక్రయించేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఇలా వేట:

ఇలా వేట:

కేబీఆర్ పార్కులో ఎక్కువమంది ప్రముఖులే వాకింగ్ కు వస్తుంటారు. అలాంటి పార్కులో వరుస చైన్ స్నాచింగ్ లు జరగడం పోలీసులకు సవాల్ గా మారింది. 12చైన్ స్నాచింగ్ లు జరిగినా.. పోలీసులకు ఎక్కడా క్లూ దొరకలేదు.

ఈ నేపథ్యంలోనే పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నర్సింహను పట్టుకోగలిగారు.15 మంది పోలీసులు గత 25 రోజులుగా కేబీఆర్ పార్కులోనే సివిల్‌ డ్రెస్‌లో అతని కోసం గాలించారు. పార్కు లోపల, బయట 90సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి తరుణంలో మరోసారి స్నాచింగ్ కోసం వచ్చిన నర్సింహ ఎట్టకేలకు వారికి పట్టుబడ్డాడు.

రెక్కీ తర్వాతే చోరీ:

రెక్కీ తర్వాతే చోరీ:

స్నాచింగ్ కు రెండు రోజుల ముందు నర్సింహ పార్కులో రెక్కీ నిర్వహించేవాడు. పార్కులోకి వెళ్లిన తర్వాత బెంచీలపై కూర్చొని సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నట్లు నటించేవాడు. ఆ సమయంలో అటుగా వెళ్లే జంటలను అనుసరించేవాడు. అదే సమయంలో తన సెల్ ఫోన్ కు కాల్స్ రాకుండా.. తననెవరూ ట్రేస్ చేయకుండా మొబైల్ ఫ్లైట్ మోడ్ లో పెట్టేవాడు.

చోరీ చేసిన నగలతో ఉడాయించి.. పార్కు గ్రిల్ దూకేసిన తర్వాత.. వాటిని ఏ బండ కిందో దాచిపెట్టేవాడు. ఒకవేళ పోలీసులు పట్టుకున్నా తన వద్ద ఏమి లేవని చూపించడానికే అలా చేసేవాడే. అలా రెండు మూడు గంటల తర్వాత తిరిగి అక్కడికే వచ్చి వాటిని తీసుకెళ్లేవాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A notorious chain snatcher who was evading arrest for last few years was caught by the Hyderabad Police

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి