• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏంటి ఈ దగా?ఏమయ్యింది నిఘా?దోచుకున్నోడికి దోచుకున్నంత.!దండుకున్నోడికి దండుకున్నంత.!ఆగేదెప్పుడు?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మోసం, దగా, దుర్మార్గం, అరాచకం, అన్యాయం ఈ పదాలు సాటి వ్యక్తుల మీద ప్రభావం చూపించినా, చూపించకపోయినా ఊత పదాల్లా ఆ పదాలను పలికేస్తాం. కాని ఆ పదాల ప్రభావానికి బలైనవాడికే వాటి తీవ్రత తెలుస్తుంది. హైదరాబాద్ మహానగరంలో ఎటు చూసినా జనాల రద్దీ రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. పురుగుతున్న జనాబాకు అనుకూలాంగా మౌళిక వసతులు, సదుపాయాలు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడంలో కాస్త పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో డిమాండ్ బాగా ఉంటుంది కాబట్టి అక్రమాలకు కూడా ఆస్కారం ఉంటుంది.

 నగర పెట్రోల్ బంకుల్లో పచ్చి మోసం.. ధాటిగా దండికొడుతున్న నిర్వాహకులు

నగర పెట్రోల్ బంకుల్లో పచ్చి మోసం.. ధాటిగా దండికొడుతున్న నిర్వాహకులు

హైదరాబాద్ నగరంలో సుమారు 650 పెట్రోల్ బంకులు పనిచేస్తున్నట్టు అధికారులు వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ 650 పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ సరిగ్గా కొలత ప్రకారం వాహనాల్లో నింపుతున్నారా అంటే మోహం ప్రశ్నార్ధకంగా మారక తప్పదు. అక్కడ రీడింగ్ చూస్తాం.. ఇక్కడి డబ్బులు చెల్లిస్తాం.. కానీ పెట్రోల్ ఎంత వరకు కరెక్టుగా వాహనంలో పడిందనేది రన్నింగ్ లో మాత్రమే తెలుస్తుంది. బైక్ రోజు ఇచ్చే మైలేజ్ ఇవ్వకుండా సడెన్ బండిలో పెట్రోల్ ఐపోయిందంటే అది వందకు వందకు శాతం బంకులో మోసం జరిగినట్టు లెక్క. నగరంలో ప్రస్తుతం ఏ బంకులో కూడా సరైన నిఘా లేకపోడంతో అక్రమాలను పాల్పడుతున్నారు బంకు నిర్వహకులు.

 రెండొందల పెట్రోల్.. రెండు కిలోమీటర్లు వెళ్లకముందే పెట్రోల్ నిల్ అంటున్న వాహనాలు

రెండొందల పెట్రోల్.. రెండు కిలోమీటర్లు వెళ్లకముందే పెట్రోల్ నిల్ అంటున్న వాహనాలు

శ్రీనగర్ కాలనీ లోని ఓ బంకులో 200 రూపాయల పెట్రోల్ కొట్టించుకున్న ఓ వ్యక్తి మైత్రి వనం చౌరస్తాకు వెళ్లే సరికి బండి మొరాయించింది. వాహనం ఎందుకు ఆగిపోయిందని అటు వంచి ఇటు వంచి చూస్తే నో పెట్రోల్. అవాక్రయిన వాహదారుడు అమాయక చూపులు తప్ప చేసేదేముంది.? వెనక్కి రాలేడు.. జరిగిన అన్యాయాన్ని గొంతెంతి చెప్పలేడు. బంకు యాజమాన్యాన్ని నిలదీయలేడు. ప్రస్తుతం నగరంలోని సగానికి సగం పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసం ఇదే.

 లోపించిన నిఘా.. రెచ్చిపోయి మోసాలకు పాల్పడుతున్న బంకు నిర్వహకులు

లోపించిన నిఘా.. రెచ్చిపోయి మోసాలకు పాల్పడుతున్న బంకు నిర్వహకులు

సరైన నిఘా లేక, ఆకస్మిక తనిఖీలు చేసే నిజాయితీ అధికారల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి మోసాలు పెట్రోల్ బంకుల్లో యధేఛ్చగా చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ద్విచక్ర వాహనాల్లోనే కాకుండా పెట్రోల్ మైలేజ్ రేంజ్ ని చూపించే సాంకేతికత ఉన్న లేటెస్టు కార్లలో కూడా పెట్రోల్ దండికొడుతున్నారు నిర్వాహకులు. ఏంటి బాబూ అసలు పాయింట్లు చూపట్లేదు కారులో అని అడిగితే కాస్త ముందుకు వెళ్లండి సార్ అదే చూపిస్తుందనే సమాధానం వస్తుంది. తీరా ముందుకు వెళ్లిన తర్వాత పోయించిన పెట్రోల్ కాదు కదా ఉన్న పెట్రోల్ ఐపోయిన్నట్టు చూపిస్తుంటాయి ఈ లేటెస్టు కార్లు.

 అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. నిఘా పెంచాలంటున్న వాహన దారులు

అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. నిఘా పెంచాలంటున్న వాహన దారులు


హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో నిత్యం ఈ దందా, మోసం దగా, అక్రమం, అన్యాయం చోటు చేసేకుంటూనే ఉంది.పట్టించుకున్న నాథుడు ఉండడు.ఎవరికి ఫిర్యదు చేయాలో తెలియదు. ఎలా న్యాయం జరుగుతుందో తెలియదు. పెట్రోల్ నింపుకుని రెండు కిలోమీటర్లు వెళ్లకుండానే వాహనం ఆగి పోవడం, 100కిలోమీటర్లు వెళ్లాల్సిన కారు 10కిలోమీటర్లు వెళ్లి ఆగిపోవడం నిత్యం చూస్తూనే ఉన్నాం. వ్యవస్ధలో చోటుచేసుకున్న లోపాలను, అధికారులు ఏమరుపాటును ఆసరా చేసుకున్న కొంత మంది బంకు నిర్వహకులు ఈ అక్రమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ అదికారులు ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరిస్తే ఇలాంటి మోసాలను అరికట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
At present, there is no proper surveillance in any petrol bunk in the city, so the petrol bunk managers are committing irregularities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X