చిరంజీవికి అందుకే దూరమా: రెండు కోణాలు.. దటీజ్ పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడుతారు. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆయన తన అన్నయ్య చిరంజీవిని ఆకాశానికెత్తాడు.

అయితే, అంతకు కొద్ది రోజుల ముందే... రాజకీయంగా తాను తన సోదరుడితో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

నో ఎంట్రీ: చిరంజీవికి నో చెప్పిన పవన్ కళ్యాణ్! పీఆర్పీ ఎపెక్ట్.. జనసేన జాగ్రత్త

ఓ వైపు రాజకీయంగా, జనసేన అధినేతగా తన అన్నయ్య దారి, తన దారి వేర్వేరు అని సూటిగా చెప్పారు. తామిద్దరం కలిసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇక, సినిమాలు, కుటుంబం విషయానికి వస్తే మాత్రం అన్నయ్యే హీరో అని చెబుతున్నారు.

అన్నయ్య దారితో విభేదించినా..

అన్నయ్య దారితో విభేదించినా..

ఇటీవల పవన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాజకీయంగా తన అన్నయ్య దారి, తన దారి వేరు అని, తామిద్దరం కలిసే ప్రసక్తి లేదని చెప్పారు. తద్వారా 2019 నాటికి మెగా సోదరులు కలుస్తారా అనే చర్చకు ముగింపు పలికారు. అది రాజకీయం.

నిన్న (శనివారం ) సినిమా వేడుకలో అన్నయ్య జపం చేశారు. తన ఉద్దేశంలో చిరంజీవే తన హీరో అన్నారు.

పూర్తి క్లారిటీ

పూర్తి క్లారిటీ

పవన్ వ్యాఖ్యలను బట్టి ఆయన వ్యాఖ్యల్లో పూర్తి క్లారిటీ కనిపిస్తోందని అంటున్నారు. ఎక్కడా తడబాటు కనిపించడం లేదని చెబుతున్నారు. గతంలో కుటుంబ సినిమా ఫంక్షన్లకు రాలేదనే విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు మాత్రం విషయాన్ని స్పష్టంగా చెప్పారని అంటున్నారు.

రెండు కోణాలు.. దేనిది అదే

రెండు కోణాలు.. దేనిది అదే

రాజకీయంగా అన్నయ్యతో కలిసి పని చేసేది లేదని చెప్పినప్పుడు ఓ కోణం, కుటుంబం, సినిమాల పరంగా మాట్లాడినప్పుడు మరో కోణం కనిపిస్తోందని చెబుతున్నారు.

కాంగ్రెస్‌ అంటే పడకనే చిరంజీవికి దూరమా?

కాంగ్రెస్‌ అంటే పడకనే చిరంజీవికి దూరమా?

పవన్ కళ్యాణ్‌కు కాంగ్రెస్ పార్టీ అంటే పడదు అనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన సోదరుడు చిరంజీవితో (రాజకీయంగా) కలిసేది లేదని చెబుతున్నారని అంటున్నారు.

సహకారం మొదలు నిలదీసే వరకు..

సహకారం మొదలు నిలదీసే వరకు..

బీజేపీ - టీడీపీ కుటమికి మద్దతు మొదలు.. తాజాగా వారిని నిలదీసే వరకు తరిచి చూస్తే పవన్ కళ్యాణ్‌లో మిగిలిన రాజకీయ నాయకుల కన్నా ఎంతో ఎక్కువ సామాజిక స్పృహ కనిపిస్తోందని చెబుతున్నారు. అందుకే చిరంజీవి, కాంగ్రెస్ పార్టీని కూడా దూరం పెట్టేందుకు సిద్ధమని చెప్పేశారంటున్నారు. ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి మాత్రం అన్నయ్యకు ఇచ్చే ప్రాధాన్యత, విలువ ఇస్తున్నారు.

పరోక్షంగా రాజకీయాల గురించి కూడా పవన్ స్పందించారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని, హీరోను అవుతానని అనుకోలేదని, ఏ పని ఇచ్చినా.. అది తోటపని కావొచ్చు, వీధులు వూడ్చే పని కావచ్చు, ఎలాంటి పనైనా నిజాయతీగా చేస్తానని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేస్తానని, జరిగిందా మంచిది.. జరగలేదా ఇంకా మంచిది.. అందరి బిడ్డలూ ఒకటే అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan said that his Brother Chiranjeevi is his hero for ever in films.
Please Wait while comments are loading...