వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్రపురి కాలనీలో అక్రమాలు అంటూ ఆందోళన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : చిత్రపురి కాలనీ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని చిత్రపురి సాధన సమితి డిమాండ్ చేసింది. ఏపీ సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటి లిమిటెడ్ చట్టవిరుద్ధంగా భూమి కేటాయించారని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ గత 50 రోజులుగా కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. ఇవాళ వీరికి బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు.

Chitrapuri Sadhana Samiti demanded comprehensive investigation on irregularities

కమిటీ చర్యను నిరసిస్తూ ప్రెస్ క్లబ్ వద్ద తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కార్యక్రమం ఏర్పాటు చేశారు. హాజరైన నేతలు కార్మికుల నిరసనకు మద్దతు తెలిపారు. తమకు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూమిని కొందరు ప్రేవేట్ వ్యక్తులకు విక్రయించారని మండిపడ్డారు. 67 ఎకరాల భూమిని గద్దల్లా తన్నుకుపోయారని మండిపడ్డారు. కమిటీ సభ్యులు కార్మికులకు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు గృహలను విక్రయించారని ఆరోపించారు.

Chitrapuri Sadhana Samiti demanded comprehensive investigation on irregularities

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ .. చిత్రపురి సాధన సమితి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లానని హామీనిచ్చారు. ఈ సభలో చిత్రపురి సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, నరసింహారెడ్డి,మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

English summary
Chitrapuri Sadhana Samiti has demanded a comprehensive investigation into the irregularities in the Chitrapuri colony. AP Cine Workers Co-operative Housing Society Limited alleged that the land was illegally allocated. Workers have been protesting for the past 50 days to protest this. Ponguleti Sudhakar Reddy, BJP leader, today expressed solidarity with them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X