ఆ ప్రకటనతో బీజేపీకి లైన్ క్లియర్ చేసిన సీఎం కేసీఆర్... ఇక ఆపరేషన్ షురూనేనా!!
తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో చేసిన సంచలన ప్రకటన బీజేపీకి మార్గం సుగమం చేస్తుందా? వచ్చే ఎన్నికలలో టిక్కెట్ల కేటాయింపుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన టిఆర్ఎస్ పార్టీలో ఎటువంటి మార్పులు తీసుకు రాబోతుంది? కెసిఆర్ తాజా ప్రకటనతో బీజేపీ ఏం చేయబోతోంది? అన్న ఆసక్తికరమైన చర్చ తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది.

మళ్ళీ టికెట్లు సిట్టింగ్ లకే.. టీఆర్ఎస్ లో వాళ్లకు షాక్
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో అనేక అంశాల పైన క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో ఎవరు పోటీ చేస్తారు అన్న దానిపైన కూడా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలలో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇస్తామని చెప్పిన కేసీఆర్, ఇప్పటి నుంచే నియోజకవర్గంలో ప్రజల మద్దతును కూడగట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు ఈసారి తమకు కెసిఆర్ టికెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. టిక్కెట్ల పైన ఆశలు పెట్టుకున్న టిఆర్ఎస్ పార్టీ నేతలకు కేసీఆర్ చేసిన ప్రకటన పెద్ద షాక్ ఇచ్చినట్టుగానే చెప్పాలి.

టీఆర్ఎస్ సీనియర్లలో సందిగ్ధం .. భవిష్యత్ పై ప్రశ్న
ఇక ఇదే సమయంలో కెసిఆర్ సిట్టింగ్ లకే మళ్ళీ టికెట్ ఇస్తానని చేసిన ప్రకటన పార్టీలోనూ ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఇక చాలామంది సీనియర్ నేతలు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ నేతల పై గెలిచిన అటువంటివారు ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కూడా టిక్కెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సీనియర్ నేతలకు చాలామందికి ఆగ్రహం తెప్పిస్తుంది. తమ పరిస్థితి ఏమిటని ప్రతి ఒక్కరూ ఆలోచించేలా చేస్తోంది. టిఆర్ఎస్ పార్టీ కోసం ఇంత కాలం పని చేసి, తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటం చేసిన తమ పరిస్థితి ఏమిటి అన్నది వారి ముందు ప్రశ్నగా మారింది.

మంత్రులుగా చేసి ఓడిన వారి పరిస్థితి ఏంటి?
గతంలో క్యాబినెట్ మంత్రులుగా పనిచేసిన వారు, సీనియర్ నాయకులు చాలామంది కెసిఆర్ ప్రకటనతో ఒకింత ఖంగుతిన్నారు. జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి వంటి పలువురు నేతల ఆశలపై సీఎం కేసీఆర్ నీళ్లు చల్లారు. ఇక దీంతో ప్రస్తుతం కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో వీరంతా ఇతర పార్టీల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

కేసీఆర్ ప్రకటనతో బీజేపీకి మార్గం సుగమం
కేసీఆర్ చేసిన తాజా ప్రకటన బిజెపికి కూడా మార్గం సుగమం చేసింది. ఇక అన్ని నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే లను మినహాయించి, టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలు, టికెట్ ఆశించిన నేతలను బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టుకునేలా సీఎం కేసీఆర్ చేసిన తాజా ప్రకటన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో బిజెపి నేతలు టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతలను టార్గెట్ చేసి వచ్చే ఎన్నికలలోపే బీజేపీ తీర్థం పుచ్చుకునేలా చేయాలని వ్యూహం రచిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేసిన తాజా ప్రకటన టిఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుస్తుందా? నష్టం చేస్తుందా? బిజెపికి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుంది? వంటి అనేక అంశాలు ముందు ముందు తెలియనున్నాయి.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త!












Click it and Unblock the Notifications