గుళ్లు, గోపురాలు తిరగడమే.. గవర్నర్ కు ఇంకో పనే లేదు : వీహెచ్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాల్లో నాణ్యత లోపాలపై వస్తోన్న ఆరోపణలతో గొంతు కలిపారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. పనులను పర్యవేక్షించాల్సిన గవర్నర్ కూడా విషయాన్ని పక్కనబెట్టేసి గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, వాటి చుట్టూ తిరగడం తప్ప ఆయనకు ఇంకో పనిలేదని మండిపడ్డారు.

పుష్కర పనులపై గవర్నర్ అలసత్వాన్ని తప్పుబట్టిని వీహెచ్.. నాసిరకం పనులతో పుష్కర నిర్మాణాలు జరుగుతుంటే గవర్నర్ నరసింహన్ ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు. విజయవాడ భవానీ ఘాట్ వద్ద నిర్మించిన బ్రిడ్జిని నాసిరకం పనులతో కానిచ్చేశారని, బ్రిడ్జి పిల్లర్ కూలిపోతున్నా పట్టించుకున్నవారే లేరని అసంత్రుప్తి వ్యక్తం చేశారు.

Congress Leader VH criticized Governor narashimhan

గవర్నర్ పనితీరును విమర్శించిన వీహెచ్.. గవర్నర్ కు అందుతోన్న విజ్ఞప్తులన్నీ చెత్తబుట్టలోకే వెళ్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పుష్కర పనులపై శ్రద్ద పెట్టి.. కాంట్రాక్టర్ల పనితీరుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వీహెచ్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Leader VH criticized Governor narashimhan for neglecting krishna pushkarams works. He made some allegations that contractors are building quality less constructions

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి