వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీ.శ్రీ‌నివాస్ రాజ‌కీయ భ‌వితవ్యం పై 'కారు' చీక‌ట్లు..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణాలో సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌గా ముద్ర‌ప‌డ్డ డీ శ్రీ‌నివాస్ రాజ‌కీయ జీవితం అష్ట‌దిగ్బంద‌నంగా మారింది. క‌ర్ణుడు చావుకు వెయ్యి కారాణాలున్న‌ట్టు డీ. శ్రీ‌నివాస్ రాజ‌కీయ అస్త‌మ‌యానికి కూడా అన్నే కార‌ణాలు చెప్పొచ్చు. త‌న‌యుడి రాజ‌కీయ ప్ర‌స్థానం ముందుకాళ్ల‌కు బంధం వేయ‌గా, మ‌రో త‌న‌యుడి వ్య‌స‌నం డీ శ్రీ‌నివాస్ రాజ‌కీయ జీవితానాకి ఘోరీ క‌ట్టే ప‌రిస్థితి క‌ల్పించింది. అంతే కాకుండా సొంత పార్టీలో సొంత నేత‌ల సూటిపోటి మాట‌లు గులాబీ పార్టీలో డీఎస్ ను పొస‌గ‌కుండా చేస్తున్నాయి. వాస్త‌వానికి అదికార పార్టీలో ఉన్న డి.శ్రీ‌నివాస్ కు త‌న కొడుకుల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొట్ట‌డానికి అర‌నిమిషం ప‌ని. దానికి అమాత్యుల అండ‌దండ‌లు ఉండాలి. కాని కొద్ది రోజుల క్రితం నుండి గులాబీ బాస్ కుంటుంబంతో వైరం పెంచుకున్న డీ.శ్రీ‌నివాస్ స్వ‌త‌హాగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయారు. ఇప్పుడు త‌న కొడుల‌కులను ర‌క్షించుకునే ప‌రిస్థితులు కూడా అంత‌గా క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతానికి రాజ‌కీయంగా ఒంట‌రైన డీఎస్ కు త‌న‌ను తాను ర‌క్షించుకునే ప‌రిస్థితే క‌నిపించ‌డం లేదు. ఇక త‌న కుమారులను ఎలా ర‌క్షిస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అదికార పార్టీలో ఉండి, అదికారం చ‌లాయిస్తున్న‌ప్ప‌టికి బాస్ తో స‌హా కుంటుంబ స‌భ్యుల అండ లేక‌పోతే అదోగ‌తి పాల‌వుతార‌నే వాస్త‌వానికి నిలువెత్తు నిద‌ర్శ‌న‌మే డీ.శ్రీ‌నివాస్.

అమాత్యుల అండ‌దండ‌లు లేక‌పోతే ఎంత‌టి వారైనా అంధ‌కారంలోకే..!!

అమాత్యుల అండ‌దండ‌లు లేక‌పోతే ఎంత‌టి వారైనా అంధ‌కారంలోకే..!!

తాజా పరిణామాలు డి శ్రీనివాస్ రాజకీయ భ‌విత‌వ్యం పైన నీలినీడలు కమ్మేలా చేశాయి. టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే డిఎస్ ను కాంగ్రెస్ లో అడుగు పెట్టనివ్వకుండా కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు. మధు యాష్కీ లాంటి వారు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పాలని డిామాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం డిఎస్ కుటుంబం ఉన్న పరిస్థితి యాష్కీ లాంటి వారికి మరింత బలాన్ని ఇచ్చే అవకాశముంది.ఇదే సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా శ్రీనివాస్ పట్ల అంత ఆసక్తి చూపించకపోవచ్చు. ఇక బీజేీపీ కూడా ఆయనను దగ్గరకు తీసే అవకాశం లేదు. మొత్తానికి ఈ సీనియర్ నేత తెలంగాణ రాజకీయాల్లో మౌన మునిగా మిగిలిపోవాల్సిన సమయం ఆసన్నమైన్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఓ ప‌క్క స‌న్ స్రోక్.. మ‌రో ప‌క్క సొంత నేత‌ల‌తో బ్రేక్ అప్.. డీఎస్ ను చుట్టు ముట్టిన స‌మ‌స్య‌లు..

ఓ ప‌క్క స‌న్ స్రోక్.. మ‌రో ప‌క్క సొంత నేత‌ల‌తో బ్రేక్ అప్.. డీఎస్ ను చుట్టు ముట్టిన స‌మ‌స్య‌లు..

కొడుకు సంజయ్ వ్యవహార శైలి కారణంగా డి.ఎస్ రాజకీయ జీవితంపైన నీలినీడలు కమ్ముకున్నాయి.విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ వివాదంలో ఇరుక్కున్నారు. విద్యార్థునులను విచారించిన పోలీసులు ఆయనపైన కేసు నమోదు చేశారు.ఏ క్షణమైనా ఆయనను అరెస్టు చేయడానికి నిజామాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు.ఈ వ్యవహారంతో డిఎస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.2019 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న ఆయనకు గట్టి ఎదురుదెబ్బగానే ఈ పరిణామాలను చూడాల్సి ఉంది. మరో వైపు బీజేపీ తరుపున నిజామాబాద్ ఎం.పిగా పోటీ చేయడానికి సిద్ధమౌతున్న డి శ్రీనివాస్ చిన్న కుమారుడు అర్వింద్ కూడా ఇబ్బంది పడే వాతావరణం నెలకొన్నది.

ఒక ఊరికి రాజు.. మ‌రో ఊరికి బంట్రోతు లా మారిని డీయ‌స్ పరిస్థితి..

ఒక ఊరికి రాజు.. మ‌రో ఊరికి బంట్రోతు లా మారిని డీయ‌స్ పరిస్థితి..

పీసీసీ అధ్యక్షుడిగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన ధర్మపురి శ్రీనివాస్ టీఆర్‌ఎస్ లో చేరడంతో రాజకీయంగా వెనకపడిపోయారు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు క్యాబినెట్ ర్యాంక్ పదవి సంపాదించుకున్నప్పటికి పొలిటికల్ గా మాత్రం దెబ్బతిన్నారు.మరో వైపు చిన్న కొడుకు అర్వింద్ బీజేపీలో చేరడంతో ఆయనపైన టీఆర్ఎస్ లో నీలినీడలు కమ్ముకున్నాయి.నిజామాబాద్ ఎం.పి కవిత తిరుగుబాటుతో టీఆర్ఎస్ లో డి శ్రీనివాస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ నుంచి బయటకు పంపించడానికి అధికార పార్టీ స్కెచ్ గీసింది.ఇందులో భాగంగానే డిఎస్ కుటుంబ సభ్యులపైన టీఆర్ఎస్ నేతలు కన్నేశారు. రాజకీయంగా కోలుకోలేని దెబ్బకొట్టడానికి రంగం సిద్ధమైంది.దీనికి శ్రీనివాస్ కొడుకు సంజయ్ ప్రవర్తన కూడా తోడు కావడంతో గులాబీ నాయకులకు పరిస్థితి మరింత అనుకూలంగా తయారైంది.

డీఎస్ పొలిటిక‌ల్ లైఫ్ ప‌రిస‌మాప్తం.. మ్రుగ్య‌మైన దారులు..

డీఎస్ పొలిటిక‌ల్ లైఫ్ ప‌రిస‌మాప్తం.. మ్రుగ్య‌మైన దారులు..

నిజానికి సంజయ్ వ్యవహార శైలిపైన చాలా కాలం నుంచి విమర్శలున్నాయి.గతంలో కూడా లైంగిక వేధింపులపైన గుసుగుసలు వినిపించాయి.తన కళాశాలలో విద్యార్థులను సంజయ్ వేధింపులకు గురి చేస్తున్నారంటు అప్పట్లో ప్రచారం జరిగింది.అయితే ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో సంజయ్‌ వ్యవహార శైలి బయటకు రాకుండా ఉండిపోయింది.కాని ఇప్పుడు అధికార పార్టీతో విభేదాలు రావడంతో పరిస్థితి తారుమారైంది. విద్యార్థుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు కావడంతో సంజయ్ అండర్ గ్రౌండ్ కు చేరాల్సి వచ్చింది. వాతావరణం చూస్తే డి శ్రీనివాస్ కుమారుడు జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.అదే స‌మ‌యంలో డీ శ్రీ‌నివాస్ రాజ‌కీయ భ‌విత‌వ్యం పై కారు చీక‌ట్లు క‌మ్ముకోనున్నాయి..

English summary
telangana senior leader d.srinivas not yet decided to stay in trs or join in another party. nirbhaya case filed on his elder son sanjay with that d.srinivas political career went into dark.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X