Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ లిక్కర్ స్కామ్: తెరపైకి శరత్ చంద్రారెడ్డి భార్యపేరు; బేగంపేట ఎయిర్పోర్ట్ కేంద్రంగా నగదుబదిలీ!!

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రోజుకో రకం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కేంద్రంగా నగదు బదిలీ జరిగినట్టుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అనుమానం వ్యక్తం చేస్తోంది .అంతేకాదు ఈ కేసులో ప్రైవేటు జెట్ విమానాల ద్వారా తరలించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి భార్య పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి

ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి


ఇంతకీ ఏం జరిగిందంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ డైరీలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఏ విధంగా జరిగిందో వివరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి 64 కోట్ల రూపాయల వరకు మనీలాండరింగ్ కు పాల్పడ్డారని తన రిమాండ్ డైరీలో ఈడీ వెల్లడించింది. ఇక లంచాలు ఇవ్వడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారని 34 మంది నిందితులు 140 ఫోన్లు మార్చారని, లిక్కర్ కుంభకోణం వెలుగులోకి రాగానే వారంతా ఫోన్లు మార్చారని ఇప్పటికే తన రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ పేర్కొంది.

 శరత్ చంద్రా రెడ్డి భార్య పేరు.. నగదు బదిలీ జరిగిందిలా

శరత్ చంద్రా రెడ్డి భార్య పేరు.. నగదు బదిలీ జరిగిందిలా

ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రులు వ్యవహరించారని ఈడీ పేర్కొంది. ఇక హైదరాబాదులోని బేగంపేట ఎయిర్పోర్ట్ కేంద్రంగా నగదు బదిలీ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఈ డి శరత్ చంద్ర రెడ్డి భార్య నడుపుతున్న కానిక టెక్రివాల్ సంస్థ ద్వారా లావాదేవీలు జరిగినట్టు గా అనుమానిస్తున్నారు . జట్ సెట్ గో సంస్థ ద్వారా నగదు బదిలీ అయినట్టుగా అనుమానిస్తున్న ఈడి ఆ సంస్థకు సీఈవోగా పనిచేస్తున్న శరత్ చంద్రారెడ్డి భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడీ లేఖ

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడీ లేఖ

ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈనెల 17వ తేదీన ఈడీ లేఖ రాసింది. ఈ సంస్థకు సంబంధించి అన్ని వివరాలు ఇవ్వాలని ఈడి తన లేఖలో కోరింది. ఇప్పటికే ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి ని అరెస్ట్ చేసిన ఈడీ, నగదు తరలింపు వ్యవహారానికి సంబంధించి శరత్ చంద్రారెడ్డి భార్య పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తును కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా 169 చోట్ల తనిఖీలు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 34మంది పాత్ర బయటపడిందని వెల్లడించింది.

ఆరు రిటైల్ జోన్ ల కోసం వంద కోట్ల ముడుపులు.. హైదరాబాద్ కేంద్రంగా దందా

ఆరు రిటైల్ జోన్ ల కోసం వంద కోట్ల ముడుపులు.. హైదరాబాద్ కేంద్రంగా దందా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరు రిటైల్ జోన్ ల కోసం పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించింది. దాదాపు 100 కోట్ల రూపాయల వరకూ లంచాలు ఇచ్చినట్టు పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన తనిఖీలను, చేసిన దర్యాప్తులో డిజిటల్ డివైజెస్ తో పాటుగా రికార్డులను సీజ్ చేశామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఇక ఈ కేసులో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన దందాను బయటకు తీసే పనిలో పడింది ఈడీ.

నేటితో ముగియనున్న శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుల ఈడీ కస్టడీ

నేటితో ముగియనున్న శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుల ఈడీ కస్టడీ

ఇదిలా ఉంటే అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరించడంతో పాటు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలోని లిక్కర్ కుంభకోణంలో ఆయన పాత్ర ఉన్నట్టు కీలకంగా గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శరత్ చంద్ర రెడ్డి తో పాటు, మద్యం వ్యాపారి వినయ బాబు లను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో వారిని హాజరు పరిచి, ఈడీ కస్టడీకి ఇవ్వాలని అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. అనుమతించిన కోర్టు షరతులను విధించింది. నేటితో వారి కస్టడీ ముగియనుంది. ఇక ఈ కేసులో వారు ఏం విషయాలు చెప్పారు అన్నది ఆసక్తిగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+