Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాక్: మెట్రోరైలులో ఇలా చేస్తే జైలుకే, మియాపూర్‌ టూ అమీర్‌పేటకు మోడీ, కెసిఆర్

మెట్రో రైల్వే సేవలు నవంబర్ 28వ, తేది నుండి హైద్రాబాద్ వాసులకు అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్: మెట్రో రైల్వే సేవలు నవంబర్ 28వ, తేది నుండి హైద్రాబాద్ వాసులకు అందుబాటులోకి రానున్నాయి. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం చేపట్టింది. అయితే మెట్రో రైల్వే స్టేషన్లలో భద్రతతో పాటు ఇతరత్రా అన్ని విషయాలపై మెట్రో రైల్వే జాగ్రత్తలు తీసుకొంటుంది.

Recommended Video

    Modi's visit confirmed to launch Hyderabad Metro

    రైల్వే స్టేషన్లలో మెట్రో రైల్వే సూచనల ప్రకారంగా నడుచుకోవాల్సిందే. లేకపోతే జైలు శిక్షతో పాటు , జరిమానాను కూడ విధించనున్నట్టు మెట్రో రైలు ప్రకటించింది. మెట్రో రైల్వే స్టేషన్లలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదనే విషయాలపై సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది.

    హైద్రాబాద్ మెట్రో రైలులో దేశంలోనే అత్యంత అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. అంతేకాదు మెట్రో రైలు ప్రారంభం నిర్ణీత షెడ్యూల్ కన్నా ఆలస్యమైనా అన్ని రకాల హంగులు, ఆర్భాటాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

    హైద్రాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర గవర్నర్, మంత్రి కెటిఆర్ పరిశీలించారు. నవంబర్ 28వ, తేదిన హైద్రాబాద్‌కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

     మెట్రో రైల్వేస్టేషన్లో నిబంధనలు పాటించాల్సిందే

    మెట్రో రైల్వేస్టేషన్లో నిబంధనలు పాటించాల్సిందే

    హైద్రాబాద్ మెట్రో రైల్వే స్టేషన్లో నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలను పాటించకపోతే పదేళ్ళ జైలు శిక్షతో పాటు జరిమానాను కూడ విధించనున్నారు. మెట్రో రైల్వే స్టేషన్లలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అంతేకాదు రైల్వే స్టేషన్లలో పరిశుభ్రతకు కూడ అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. మెట్రో రైలులో ప్రయాణం చేసే ప్రయాణీకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి రైల్వే స్టేషన్లలో సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ బోర్డులను అన్ని భాషల్లో ఏర్పాటు చేశారు. ఈ నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందే. లేకపోతే జైలుకు వెళ్ళాల్సిందే.

     మెట్రోలో ప్రయాణం చేయాలంటే పాటించాల్సిన నిబంధనలు

    మెట్రోలో ప్రయాణం చేయాలంటే పాటించాల్సిన నిబంధనలు

    హైద్రాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేయాలంటే మెట్రో రైలు అధికారుల సూచనలను పాటించాల్సిందే. రైల్లోకి ప్రవేశించిన తర్వాత ఫొటోలు తీయరాదని అధికారులు సూచించారు. అంతేకాదు రైళ్లలో ఆహారం, తినుబండారాలు తీసుకోకూడదని స్పష్టం చేశారు. అంతేకాదు పెంపుడు జంతువులను కూడ రైళ్ళలోకి తీసుకురావడాన్ని నిషేధించారు. ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాలడం... వాటి కదలికలను నిలిపివేయాలని ప్రయత్నిస్తే జైలు శిక్ష తప్పదు.

     నిషిద్ద ప్రాంతాల్లో కూర్చోకూడదు

    నిషిద్ద ప్రాంతాల్లో కూర్చోకూడదు

    మెట్రోరైల్వే స్టేషన్ పరిసరాల్లోని నిషిద్ధ ప్రాంతాల్లో కూర్చోరాదని ప్రయాణీకులకు మెట్రో రైలు అధికారులు సూచించారు.రైలు కోసం వేచి ఉన్నప్పుడు పసుపురంగు లైన్ దాటరాదని సూచించారు. రైలు ప్రయాణిస్తున్నప్పుడు బలవంతంగా డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయరాదని సూచించారు. అంతేకాదు డోర్లకు ఆనుకుని నిల్చోరాదని కూడ అధికారులు ప్రయాణీకులకు సూచిస్తున్నారు.

     అత్యవసర సమయాల్లోనే డ్రైవర్‌తో మాట్లాడాలి

    అత్యవసర సమయాల్లోనే డ్రైవర్‌తో మాట్లాడాలి

    అత్యవసర కమ్యూనికేషన్ సాధనాలతో డ్రైవర్ తో సంభాషించరాదు. వైద్యపరమైన అవసరం ఏర్పడినప్పుడు మాత్రమే వారితో సంభాషించాలని ప్రయాణీకులకు మెట్రోరైలు అధికారులకు సూచించారు.స్టేషన్ పరిసరాలు, బోగీల్లో ఉమ్మి వేయడం, ధూమపానం చేయడం, పాన్ నమలడం చేయరాదు. ఆల్కహాల్ సేవించడాన్ని నిషేధించారు. మెట్రో స్టేషన్ పరిసరాల్లో వీధి వ్యాపారాలు నిషేధం విధించారు.బోగీలకు నోటీసులు అంటిస్తే చర్యలు తీసుకొంటారు.బోగీ డోర్లు తెరుచుకునే లేదా మూసుకునే సమయంలో వాటి మధ్య నిల్చోరాదని సూచించారు.

     మెట్రో రైలులో ప్రయాణించనున్న మోడీ, కెసిఆర్

    మెట్రో రైలులో ప్రయాణించనున్న మోడీ, కెసిఆర్

    నవంబర్ 28వ, తేదిన భారత ప్రధానమంత్రి మోడీ మెట్రో రైలును ప్రారంభించనున్నారు. ఈ రైలును ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ సీఎం కెసిఆర్‌లు మెట్రోరైలులో మియాపూర్ నుంచి అమీర్ పేట వరకు ప్రయాణం చేయనున్నారు..మెట్రో రైలుతో హైద్రాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+