వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెన్త్ విద్యార్థిని పూర్ణిమసాయి ఎక్కడ, 40 రోజులైనా దొరకని ఆచూకీ

హైద్రాబాద్ కూకట్‌పల్లి నిజాంపేటకు చెందిన 10వ, తరగతి విద్యార్థిని పూర్ణిమ అదృశ్యమై నెలరోజులు దాటినా ఇంకా ఆచూకీ లభ్యంకాలేదు.సెలవులు పూర్తై పాఠశాల తిరిగి ప్రారంభమైన మూడురోజులకే పూర్ణిమ అదృశ్యమైంది. ఆమె

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైద్రాబాద్ కూకట్‌పల్లి నిజాంపేటకు చెందిన 10వ, తరగతి విద్యార్థిని పూర్ణిమ అదృశ్యమై నెలరోజులు దాటినా ఇంకా ఆచూకీ లభ్యంకాలేదు.సెలవులు పూర్తై పాఠశాల తిరిగి ప్రారంభమైన మూడురోజులకే పూర్ణిమ అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కూకట్‌పల్లికి చెందిన చొల్లంగి నాగరాజు, విజయకుమారి కుమార్తె పూర్ణిమసాయి. గత నెల 7వ, తేదిన స్కూల్‌కు వెళ్ళింది. కొద్దిసేపటికే పాఠశాల నుండి పూర్ణిమ ఇంతవరకు తిరిగిరాలేదు. పూర్ణిమ స్కూల్‌కు వెళ్ళిన కొద్దిసేపటికే ఆమె స్కూల్‌కు రాలేదని పాఠశాల యాజమాన్యం ఫోన్ చేసింది.

అయితే వెంటనే కుటుంబసభ్యులు పూర్ణిమకోసం వెతికారు. బంధువులు, స్నేహితుల ఇళ్ళల్లో గాలించినా ఇంతవరకు ఆమె జాడ కన్పించలేదు. ఆమె ఆచూకీకోసం బాధిత కుటుంబం బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది.

తమ కూతురు ఎక్కడుందో సమాచారం తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.. ఎక్కడున్నా ఇంటికి రావాలంటూ తల్లిదండ్రులు వేడుకొంటున్నారు. అయితే ఈ కేసు విషయమై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.

పోలీసుల తీరు సరిగా లేదు

పోలీసుల తీరు సరిగా లేదు

పూర్ణిమసాయి అదృశ్యమైన కేసు విషయమై పోలీసుల దర్యాప్తు సక్రమంగా లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పూర్ణిమసాయి చదివే బాష్యం స్కూల్ నిజాంపేట మెయిన్‌రోడ్డులో ఉంది. ఈ దారిలో భారీ షాపింగ్ కాంప్లెక్స్‌లు, సూపర్‌మార్కెట్‌లు, విద్యాసంస్థలున్నాయి. వీటన్నింటికి సీసీ కెమెరాలున్నాయి. తమ కుమార్తై అదృశ్యమైన కేసు దర్యాప్తులో పోలీసులు వీటిని పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. స్కూల్ సమీపంలోని ఫర్నీచర్‌షాప్ సీసీ కెమెరాలను మాత్రమే పరిశీలించారని చెప్పారు. పూర్ణిమ స్కూల్‌గేటు వద్దకు వెళ్ళినట్టు స్పష్టంగా కన్పించిందన్నారు.

ఆ ఇద్దరిపై అనుమానాలు

ఆ ఇద్దరిపై అనుమానాలు

తమ కూతురు అదృశ్యానికి సంబంధించి ఆమె చదువుతున్న పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై అనుమానాలున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గురువారంనాడు వారు బాలలహక్కుల సంఘం కార్యాలయంలో మీడియాతో ఈ విషయాన్ని చెప్పారు. మహిళా సంఘం నాయకురాలు రేఖ సైతం పోలీసుల దర్యాప్తు తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పూర్ణిమ మిస్సింగ్ కేసు విషయంలో పోలీసుల దర్యాప్తును బాలలహక్కుల సంఘం కూడ తీవ్రంగా తప్పుపడుతోందన్నారు.

పోలీసుల వాదన ఇదీ

పోలీసుల వాదన ఇదీ

గత నెల 7వ, తేదిన స్కూల్‌కు బయలుదేరిన పూర్ణిమ తరగతులకు హజరుకాలేదని ఆ రోజు ఉదయమే స్కూల్‌నుండి పూర్ణిమ తల్లికి ఫోన్ వెళ్ళింది. ఆ సమయంలో ఆమె రీసీవ్ చేసుకోలేదు.తిరిగి ఫోన్ కూడ చేయలేదు.మధ్యాహ్నం ఒంటిగంటన్నర తర్వాత స్కూల్‌కు వెళ్ళిన తల్లి పూర్ణిమ గురించి వాకబుచేసింది. స్కూల్‌కు రాలేదని సమాధానం రావడంతో అప్పుడు బంధువులు, స్నేహితుల ఇళ్ళలో వెతికారని పోలీసులు చెబుతున్నారు. అదేరోజు సాయంత్రం తమకు ఫిర్యాదుచేసినట్టు పోలీసులు చెప్పారు. 18 బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చర్యలను చేపట్టినట్టు చెబుతున్నారు పోలీసులు.

పూర్ణిమ కేసులో అస్పష్టత

పూర్ణిమ కేసులో అస్పష్టత

విశాఖ, యానాం, షిర్డి, చెన్నై తిరుపతిలోనూ ప్రత్యేక బృందాలతో పూర్ణిమ ఆచూకీ కోసం వెతికారు. తెలంగాణ, ఏపీ , కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహరాష్ట్ర డిజీపీలకు సమాచారాన్ని ఇచ్చారు. బెంగుళూరు, చెన్పై, థానే, ముంబై పోలీస్ కమిషనర్లకు కూడ ఫోటోలు పంపారు. అయినా ఫలితం లేకపోయింది. అన్ని మిస్సింగ్ కేసుల్లో 90 శాతం స్పష్టత కన్పించినా ఈ కేసులో మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.

English summary
More than a month after she went missing while leaving home for school in Bachupally, there is no trace of Poornima Sai yet.On Thursday, her parents, Nagaraju, a civil engineer, and mother, Vijaya Kumari, a homemaker, told the media, that they still had hope that their 15-year-old daughter, a Class X student, would return home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X