telangana kcr revanth reddy k chandrasekhar rao bjp kishan reddy k laxman muslim reservations తెలంగాణ రేవంత్ రెడ్డి కేసీఆర్ కే చంద్రశేఖర రావు బీజేపీ
రిజర్వేషన్ల బిల్లుకు సభ ఆమోదం: కేంద్రాన్ని అర్థించం.. కోట్లాడుతాం: కేసీఆర్
హైదరాబాద్: గిరిజన, ముస్లీం రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలను సభకు రానివ్వలేదు. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలికాయి.
దీనిని గిరిజన, బీసీ-ఈ రిజర్వేషన్ల బిల్లుగా పేర్కొన్నారు. బీసీ-ఈ రిజర్వేషన్లను నాలుగు శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయించారు. బీసీ-ఈ అంటే ముస్లీంలకు రిజర్వేషన్లు. గిరిజన రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచారు.
'ఇస్లాంలో వివక్షత లేదు, న్యాయం చేస్తున్నారా, అన్యాయమా': సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

అంతకుముందు, కేసీఆర్ దీనిపై మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో తాము విజయం సాధిస్తామని చెప్పారు. తమిళనాడు తరహాలోనే బిల్లు ఉందని చెప్పారు. కానీ మక్కీకి మక్కీ ఉంటే బిల్లులు ఒప్పుకునే పరిస్థితి ఉండదన్నారు.
కేంద్రం మాకు వదిలేయాలి, 50 శాతం ఉండాలని ఎక్కడా లేదు: కేసీఆర్ను ఇరుకున పడేసిన జీవన్
ఈ రిజర్వేషన్లపై అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి కూడా తీసుకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. ఇప్పటికి చాలా కులాలు అభివృద్ధికి నోచుకోలేదని, రిజర్వేషన్లతో సమాజంలో సమతుల్యత వస్తుందన్నారు. రిజర్వేషన్లపై కేంద్రాన్ని అర్థించమని కేసీఆర్ తేల్చి చెప్పారు. అవసరమైతే లోకసభలో గొడవ చేస్తామన్నారు.