వాళ్ళ వల్ల కేసీఆర్ పై తీవ్రమైన ఒత్తిడి.. గులాబీ బాస్ కు అడుగడుగునా ముళ్ళే!!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై భయంకరమైన ఒత్తిడి పెరుగుతుందా? గతానికి భిన్నంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోనూ, దేశంలోనూ పోరాటం చేయాల్సి వస్తుందా? తెలంగాణ రాష్ట్రంలోనూ ఇంతకాలం ఒకెత్తు ఇప్పుడు ఒక ఎత్తు అన్నది చర్చ జరుగుతోందా? అన్ని వైపుల నుండి కెసిఆర్ పై పెరుగుతున్న ఒత్తిడిని ఆయన తట్టుకుని రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని నిలబెడతారా? రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి ఆది నుండీ కష్టాలు తప్పటం లేదా ? ఇక నుండి గులాబీ బాస్ కు అడుగడుగునా ముళ్ళు తప్పవా? తాజా రాజకీయ పరిణామాలతో సీఎం కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

రెండు దఫాలుగా కేసీఆర్ పాలన.. ఇప్పుడు మారిన పరిస్థితులతో ఒత్తిడి
కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటుతో రాష్ట్ర ఏర్పాటు జరిగిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. రెండు దఫాలుగా అధికారంలో ఉన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యర్ధి పార్టీల నుండి ఇంతకాలం గట్టిగా ప్రతిఘటన ఎదుర్కోలేక పోయారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అంటూ ఏ పార్టీ ఆందోళన చేసినా, కెసిఆర్ లైట్ తీసుకున్నారు.
తనదైన శైలిలో పాలన సాగిస్తూ ముందుకు సాగిన కేసీఆర్ ఇంత కాలం తర్వాత ఇప్పుడు ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.

బీజేపీ, వైఎస్సార్టీపీ, రేవంత్ రెడ్డి ఎఫెక్ట్
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలం పుంజుకోవడం, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగించడం, బిజెపి పాదయాత్రకు ప్రజల నుంచి కూడా మద్దతు లభించడం సీఎం కేసీఆర్ పై ఒత్తిడి పెంచుతుంది. ఇక ఇదే సమయంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కూడా పాదయాత్ర చేయడం, పాదయాత్రలో ఆమె ప్రధానంగా సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసుకోవడం కూడా కెసిఆర్ పై ఒత్తిడి మరింత పెంచింది. మరోవైపు కాంగ్రెస్ కూడా తమ వంతు ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను నిత్యం టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల మూకుమ్మడి దాడి
అంతేకాకుండా కేంద్రంలోని బిజెపి కేసీఆర్ తో తలపడుతున్న క్రమంలో బిజెపి అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రం పై ఫోకస్ పెట్టడం కెసిఆర్ పై మరింత ఒత్తిడి పెరగడానికి కారణం గా మారింది. ఒకపక్క ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సిబిఐ కవితను విచారించడం, తెలంగాణలోని ముఖ్య నాయకులను, వ్యాపారవేత్తలను టార్గెట్ చేయడం, క్యాసినో కుంభకోణం, తెలంగాణ మంత్రులు, టిఆర్ఎస్ నాయకుల పై ఐటి దాడులు, సిబిఐ విచారణలు వెరసి కెసిఆర్ పై ఒత్తిడి పీక్స్ కి చేరుకుంది.
రాష్ట్రంలోనే తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో విజయం సాధిస్తారా? అది అంత సాధ్యమేనా? అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణా ప్రజలు మూడో సారి కేసీఆర్ కు పట్టం కడతారా ? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

తెలంగాణాలో, దేశంలో కేసీఆర్ చక్రం తిప్పుతారా?
ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ప్రయత్నాలు చేయడం, ఆ ప్రయత్నం ఏమేరకు సక్సెస్ అవుతుంది అన్న ఆందోళన కూడా కెసిఆర్ లో ఒత్తిడిని మరింత పెంచుతుంది. గతానికి భిన్నంగా సీఎం కేసీఆర్ పై తాజా పరిణామాలతో ఊహించని విధంగా ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడిని తట్టుకుని కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారా? తెలంగాణలోనే కాకుండా దేశ రాజకీయాలలో చక్రం తిప్పగలుగుతారా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications