వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నయీం ఆస్తులు మాకే చెందాలి': ఐటీ నజర్, జఫ్తుకు అవకాశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం అక్రమంగా కూడగట్టిన 2,500 ఎకరాలకు పైగా భూములను, ఆస్తులను జప్తు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. లభించిన డాక్యుమెంట్లను బట్టి ఎన్ని వేల ఎకరాలు ఉంది? ప్రస్తుతం మార్కెట్లో భూమి విలువెంత? వంటి అంశాలను పొందుపర్చనున్నారు.

నయీం 'ఎమ్మెల్యే' కలలు: ప్రచారం కోసం టీవీ ఛానల్, ఆస్తులు ఎలా?మరోవైపు చార్జిషీట్ దాఖలు తర్వాత ఆస్తుల జప్తుకు కోర్టు నుంచి అనుమతి తీసుకోవచ్చునని, కోర్టు ఆదేశాల ప్రకారం భూములను, ఆస్తులను జప్తు చేసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే సోదాలు చేసిన నయీం ఇంటిని సైబరాబాద్ వెస్ట్ పోలీసులు సీజ్ చేశారు.

శంషాబాద్‌లోని అపార్టుమెంట్‌లో ఉన్న రెండు ఫ్లాట్లు, నల్గొండ జిల్లాలో రెండు ఇండ్లు, సైబరాబాద్ ఈస్ట్‌లోని ఇంజాపూర్‌లోని ఇంటిని కూడా సీజ్ చేశారు. అలాగే నయీం అనుచరుల ఇళ్లనూ త్వరలోనే సీజ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

IT department keenly watching Nayeem's case

నయీం అనుచరుల ఇళ్లలో సోదాలు

నార్సింగిలోని నయీం ఇంట్లో బుధవారం సాయంత్రం సిట్ ప్రత్యేక అధికారి నాగిరెడ్డి స్వయంగా సోదాలు నిర్వహించారు. నయీం బెడ్ రూమ్, పర్సనల్ రూంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

వనస్థలిపురం ద్వారకామాయినగర్‌లో నయీమ్ అనుచరుడు ఖయ్యూమ్ ఇంటిని పోలీసులు గుర్తించారు. ఖయ్యూమ్ ఇంట్లో కూడా పలు కీలక డాక్యుమెంట్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే ఇంట్లో మరో ఇద్దరు అనుచరులు నరేష్, సుధాకర్ కూడా ఉంటున్నారు.

విస్తుపోయే నిజాలు: మాజీ డీఎస్పీతో లింక్, నయీం సంరక్షణ బాధ్యత ఏసీపీకిఅయితే, నయీం ఎన్‌కౌంటర్ అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. వీళ్లిద్దరూ రిటైర్డ్ ఏసీపీ ఇంటి సమీపంలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అలాగే, మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించి నయీం అనుచరులుగా అనుమానిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

నయీం ఆస్తులు మాకే చెందాలి: బాధితులు

నయీం బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వందలాది మందిని బెదిరించి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన నయీం మృతి చెందడంతో.. అతని బారినపడి ఆస్తులు, నగదు పోగొట్టుకున్నవారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

నయీం ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో తమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఉంటాయని చెబుతున్నారు. చంపేస్తానని బెదిరించి తమ నుంచి ఆస్తులు కాజేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా పోగొట్టుకున్న ఆస్తులను తమకే అందజేయాలంటున్నారు. కాగా, నయీం ఆస్తులు పెద్ద ఎత్తున బయటపడుతుండటంతో ఆదాయపన్ను శాఖ దృష్టి సారించింది.

గ్యాంగ్ స్టర్ నయీం అక్రమంగా కూడగట్టిన 2,500 ఎకరాలకు పైగా భూములను, ఆస్తులను జప్తు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. లభించిన డాక్యుమెంట్లను బట్టి ఎన్ని వేల ఎకరాలు ఉంది? ప్రస్తుతం మార్కెట్లో భూమి విలువెంత? వంటి అంశాలను పొందుపర్చనున్నారు.

English summary
The Income Tax department is keenly watching Nayeem's case in which property worth hundreds of crores have come to light. So far, the police has seized cash and documents regarding properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X