ఇంత భక్తా.. 5 కి.మీ. సాష్టాంగ నమస్కారం చేస్తూ గుడికి వెళ్లిన దంపతులు
భారతీయ సంస్కృతిలో దైవాన్ని ఆరాధించడం విశిష్టమైనదిగా చెబుతుంటారు. కష్టమైనా సుఖమైనా దేవుడితో మొరపెట్టుకుంటారు. దేవుడ్ని కోరికలు కోరుతుంటారు. అవి తీరితే మోకాళ్ల మీద వస్తామని.. సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తామని.. తల నీలాలు సమర్పిస్తామని ఇలా ముక్కులు చెల్లించుకుంటారు. అయితే ఓ జంట ఏకంగా 5 కి.మీ. సాష్టాంగ నమస్కారం చేస్తూ గుడికి వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మరీ ఇంత భక్తా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవాలయాలన్నీ కిటకిటలాడాయి. తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. వందలాదిగా భక్తులు తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. అయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ జంట తమ మొక్కులను విశేషంగా తీర్చుకుంది. ఆ దంపతులు ఏకంగా 5 కి.మీ. సాష్టాంగ నమస్కారం చేస్తూ గుడికి వెళ్లారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి పరిధిలోని రాజారం గ్రామానికి చెందిన మామిడాల వెంకటేష్, శారద దంపతులు వినూత్నంగా దేవుడిపై తమ భక్తిని ప్రదర్శించారు. మొక్కులు తీర్చుకునేందుకు 5 కిలోమీటర్ల దూరం సాష్టాంగ నమస్కారాలు చేస్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. దాంతో రోడ్డుపై ప్రజలంతా ఆ దంపతుల భక్తిని చూస్తూ ఉండిపోయారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అనంతరం ఆ దంపతులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆ గ్రామస్థులంతా వారి భక్తిని కొనియాడుతున్నారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications