వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను జ‌న‌సైనికున్ని...! ఆడా వుంటా...!! ఈడా వుంటా..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

తెలంగాణలో పోటీ చేయనున్న జనసేన....!

జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లో స్పీడ్ పెంచిన‌ట్టు క‌నిపిస్తోంది. అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని అనుకూలంగా మార్చుకుంటూ అదికార పార్టీ పైన అక్షింత‌లు వేస్తున్నారు. ఈ మ‌ద్య కాలంలో జ‌న‌సేన విజ‌న్ డాక్యుమెంట‌రీని విడుద‌ల చేసి జ‌న‌సేన ల‌క్ష్యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. త‌న‌కు కులం, మ‌తం, ప్రాంతీయ‌త‌త్వం లేద‌ని చెప్పుకునే వ‌ప‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ అడుగులు తెలంగాణ‌లో సైతం వేయ‌బోతున్నట్లు తెలుస్తోంది. అదికార గులాబీ పార్టీతో క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేంద‌కుకు తెర వెనుక పావులు క‌దిలిస్తున్న‌ట్టు స‌మాచారం. అంతా అనుకున్న‌ట్టు జ‌రిగితే గులాబీ ద‌ళానికి జ‌న‌సైనికులు తోడై తెలంగాణ‌లో ఇత‌ర పార్టీల‌పైన ప్ర‌భావం చూపిస్తార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలంగాణ‌లో పోటీ..! జ‌న‌సేన‌కు లేదు సాటి..!

తెలంగాణ‌లో పోటీ..! జ‌న‌సేన‌కు లేదు సాటి..!

తెలంగాణలో పార్టీని దశల వారీగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు జ‌న‌సేనాని. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని జనసేన కేంద్ర కార్యాలయంలో బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్‌ కళ్యాణ్‌ ఆ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. బాధ్యత తీసుకున్న వారికే ప్రశ్నించే హక్కు ఉంటుందని, బాధ్యత ఉంటే ఏ సమస్యనైనా సయోధ్య ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ దేశానికి సంబంధించి సమగ్రత, సమైక్యతను కాపాడుకోవడంతో పాటు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఉద్బోదించారు.

 జ‌న‌సేన‌ను తెలంగాణాలో నిర్మిస్తా..! బంగారు తెలంగాణకు బాట‌లు వేస్తా..!

జ‌న‌సేన‌ను తెలంగాణాలో నిర్మిస్తా..! బంగారు తెలంగాణకు బాట‌లు వేస్తా..!

వీర తెలంగాణ పోరాటం గురించి తాను చదివానని, ఇక్కడి యువత, విద్యార్థులు, మహిళాలోకం చెబుతున్న విధంగా జనసేనను తెలంగాణ రాష్ట్రంలో నిర్మిద్దామని, వారు ఆశించిన బంగారు తెలంగాణను ఆవిష్క రిస్తామని పవన్ కళ్యాణ్ అంటున్నారు. తెలంగాణలో జనసేన బలంగా ఉన్నచోట అభ్యర్థులను పోటీకి నిలబెట్టేందుకు ప‌వ‌న్ ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు. మిగిలిన నియోజక వర్గాల్లో కూడా జ‌న‌సే ప్ర‌భావం చూపిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు జ‌న‌సేనాని. తెలంగాణ రాష్ట్రం పోరాట సమయంలో గద్దర్‌ లాంటి వారితో సంప్రదించానని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతమన్నా, ప్రజలన్నా తనకు ఎంతో ప్రేమ అని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ చెప్పుకొస్తున్నారు.

 యువ‌త రాజ‌కీయాల్లోకి రావాలి..! న‌వ‌భార‌త నిర్మాణం వారి తోనే సాద్యం..!

యువ‌త రాజ‌కీయాల్లోకి రావాలి..! న‌వ‌భార‌త నిర్మాణం వారి తోనే సాద్యం..!

భగత్‌సింగ్‌ 23 ఏళ్ళ ప్రాయంలో ప్రాణత్యాగం చేశారని, ఆయన త్యాగాన్ని స్పూర్తిగా తీసుకుని యువ‌త ధిశా నిర్దేశించుకోవాల‌ని ప‌వ‌న్ కోరారు. అంతే కాకుండా నేటి యువత ఒకసారి భగత్‌సింగ్‌ జీవితాన్ని చదవాలని, ఆ త్యాగధనుడు స్వహస్తాలతో రాసిన మాటలు ఆకళింపు చేసుకుని స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ వంటి మహనీయుల త్యాగాల ఫలం స్వతంత్ర భారతమని చెప్పారు. తన ఆశ ఒకటేనని ప్రతి మనిషి కన్నీళ్ళు తుడవడమే తన లక్ష్యమని చెప్పారు. అందుకే తపన పడకుండా రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని జనసేన పిలుపునిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తమ పార్టీలో పెద్ద నాయకులు లేరని కొందరు అంటున్నారని కొత్త వాళ్ళను తీసుకువస్తామని చెప్పారు.

ల‌క్ష్యం ఉంటే రాజ‌కీయాల్లో ప్ర‌భావం చూపించొచ్చు..!

ల‌క్ష్యం ఉంటే రాజ‌కీయాల్లో ప్ర‌భావం చూపించొచ్చు..!

అణచివేతకు గురైన వాళ్ళకే ఆగ్రహం ఉంటుందని రాజకీయాల్లో కొత్త నాయకత్వం రావాలని పిలుపునిచ్చారు. ఏపీ మంత్రి లోకేష్‌ ముఖ్యమంత్రి కావాలంటే తనకు అనుభవం ఎక్కడిదని అభిప్రాయ ప‌డ్డారు. స్వ‌ర్గీయ ఎంటీఆర్ 60 ఏళ్ళు దాటాక రాజకీయాల్లోకి వస్తే, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రజల్లోంచి గెలిచి పోరాటం చేసిన అనుభవం ఉందని చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన తాండాలకు వెళ్ళినా అరకు గిరిజన తాండాలకు వెళ్ళినా అక్కడి వృద్ధులు, మహిళలు కోట్ల రూపాయల ఆస్తులు కావాలని అడగడం లేదని తాగేందుకు గుక్కెడు మంచినీళ్ళు కావాలని మాత్రమే అడుగుతున్నారన్నారు.

English summary
janasena chief pavan kalyan speed up his political activities. few days ago he announced his manifesto and now he is planning to contest in telangana state next general elections. political analysts thinking how political equationswill be change in telangana if pavan contests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X