వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు అండగా నిలిచారు: సయీద్ మృతికి కెసిఆర్ సంతాపం, శ్రీనగర్‌కు మహమూద్ అలీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నేటిదాకా రాజకీయంగా తమకు ఎంతో అండగా నిలిచిన ముఫ్తీ మహ్మద్ సరుూద్ లేని లోటు వ్యక్తిగతంగా పూడ్చలేనిదని కెసిఆర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

వ్యక్తిగతంగా ముఫ్తీ మహ్మద్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ డిమాండ్‌కు దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్న సమయంలో ముఫ్తీ మహ్మద్ సరుూద్ గట్టిగా సమర్థించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

KCR condoles Mufti’s demise

హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమ సభకు ఆయన తన కూతురు మహబాబా ముఫ్తీని పంపించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ముఫ్తీ మహ్మద్ సరుూద్ అంత్యక్రియలకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని, తెలంగాణ రాష్ట్రం తరఫున ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని పంపించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. ముఫ్తీ మృతి పట్ల కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూడా సంతాపం వ్యక్తం చేశారు.

జమ్మూకాశ్మీర్‌కు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

దివంగత జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీమొహమ్మద్ సయీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ శుక్రవారం శ్రీనగర్ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం ఢిల్లీ చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం శ్రీనగర్‌కు బయలుదేరుతారు.

English summary
Chief Minister K Chandrashekar Rao expressed shock at the demise of his Jammu & Kashmir Chief Minister Mufti Mohammad Sayeed. In a message, KCR said the death of Sayeed was a personal loss for him and recalled that Sayeed had extended support to statehood movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X