కాంట్రాక్టు ఉద్యోగులకు కెసిఆర్ తీపి కబురు

Posted By:
Subscribe to Oneindia Telugu

విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దృష్టి సారించారు. ప్రగతి భవన్‌ లో గురువారం ఆయన విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్, ఉద్యోగుల క్రమబద్దీకరణకు సానుకూలంగా సీఎం స్పందించారు.విద్యుత్ శాఖలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని దశలవారీగా క్రమబద్దీకరణ చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. వెంటనే విద్యుత్ ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించుకుని చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. చాలా ఏళ్లుగా తక్కువ జీతాలతో విద్యుత్ శాఖలో సేవలందిస్తున్న ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు మానవతా దృక్పథంతో వారిని దశలవారీగా రెగ్యులరైజ్ చేయాలన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM K chandrasekhar Rao reviewed the problems of electricity employees and ordered to regularise out sourcing staff.
Please Wait while comments are loading...