వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఐపాస్‌కు ప్రశంస: చైనా ఫార్చూన్‌తో కెసిఆర్ భేటీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడుల దిశగా చైనా కంపెనీలు కదులుతున్నాయి. ఇందులో భాగంగా పలు కంపెనీలు తెలంగాణ సందర్శనకు ఆసక్తి చూపుతున్నాయి. ‘మీ పారిశ్రామిక విధానం బాగుంది. తెలంగాణను సందర్శిస్తాం. పెట్టుబడులు పెట్టే విషయం పరిశీలిస్తాం' అని చైనాకు చెందిన పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు హామీ ఇచ్చారు.

చైనాలో పర్యటిస్తున్న కెసిఆర్ శనివారం బీజింగ్‌లో ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. టిఎస్‌ఐపాస్ గురించి పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి వివరించారు. చొంగింగ్ ఇంటర్నేషనల్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్, ఇన్‌స్పూర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, చైనా ఫోర్చుల్యాండ్ డెవలప్‌మెంట్ కంపెనీ, చైనా రైల్‌వే కార్పొరేషన్, సానీ గ్రూప్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు.

తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. ఆయా కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి తెలంగాణలో ఏయే అవకాశాలు ఉన్నాయో ముఖ్యమంత్రి వివరించారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణను సందర్శిస్తామని ఆ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి ఉందని, తెలంగాణను సందర్శిస్తామని చెప్పారు.

120 మిలియన్ డాలర్ల కంపెనీ అయిన చొంగింగ్ ఇంటర్నేషనల్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ డ్యుక్సిఆన్ జహంగ్, జనరల్ మేనేజర్ ఇతర సభ్యులు తెలంగాణలో కన్‌స్ట్రక్షన్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపించారు. ప్రాజెక్టు కన్సల్టింగ్, ఆర్కిటెక్చర్ డిజైన్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇన్‌స్టలేషన్ రంగాల్లో ఈ కంపెనీ దేశంలోని ఇంతకు ముందు రెండు ప్రాజెక్టులు చేపట్టింది.

తెలంగాణలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా ఈ కంపెనీ బృందం సమావేశం అయింది. ఇన్‌సుపుర్ గ్రూప్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జాంగ్ డొంగ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. జాంగ్ డొంగ్ ఇన్‌సుపుర్ ఇండియాకు సిఇఓగా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ రంగాల్లో ఈ కంపెనీ ఇండియాలో పెట్టుబడులు పెట్టింది.

గురుగావ్ నుంచి ఈ కంపెనీ 2015 జనవరి నుంచి ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించింది. చైనాలోని క్లౌడ్ కంపెనీల్లో ఇన్‌సుపుర్ ప్రధానమైనది. ప్రపంచంలో ఐదవ పెద్ద కంపెనీగా, చైనాలో నంబర్ వన్ కంపెనీగా నిలిచింది. ప్రపంచంలోని 50 దేశాల్లో ఈ కంపెనీ ఐటి సేవలు అందిస్తోంది.

కెసిఆర్

కెసిఆర్

చైనాలోని ఫర్‌బిడెన్ నగరాన్ని సిఎం కెసిఆర్ సందర్శించారు. చారిత్రాత్మకమైన ఈ ప్రాంతంలోని అప్పటి రాజ వంశీయుల ప్యాలెస్‌లను మ్యూజియంలుగా మార్చారు. 180 ఎకరాల్లో 980 భవనాలు నిర్మించారు.

పారిశ్రామికవేత్తలతో భేటీ

పారిశ్రామికవేత్తలతో భేటీ

తెలంగాణలో పెట్టుబడుల దిశగా చైనా కంపెనీలు కదులుతున్నాయి. ఇందులో భాగంగా పలు కంపెనీలు తెలంగాణ సందర్శనకు ఆసక్తి చూపుతున్నాయి.

పారిశ్రామికవేత్తలతో భేటీ

పారిశ్రామికవేత్తలతో భేటీ

‘మీ పారిశ్రామిక విధానం బాగుంది. తెలంగాణను సందర్శిస్తాం. పెట్టుబడులు పెట్టే విషయం పరిశీలిస్తాం' అని చైనాకు చెందిన పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు హామీ ఇచ్చారు.

పారిశ్రామికవేత్తలతో భేటీ

పారిశ్రామికవేత్తలతో భేటీ

చైనాలో పర్యటిస్తున్న కెసిఆర్ శనివారం బీజింగ్‌లో ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

పారిశ్రామికవేత్తలతో భేటీ

పారిశ్రామికవేత్తలతో భేటీ

టిఎస్‌ఐపాస్ గురించి పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి వివరించారు. చొంగింగ్ ఇంటర్నేషనల్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్, ఇన్‌స్పూర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, చైనా ఫోర్చుల్యాండ్ డెవలప్‌మెంట్ కంపెనీ, చైనా రైల్‌వే కార్పొరేషన్, సానీ గ్రూప్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు.

తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఈ కంపెనీ ఆసక్తి చూపించింది. చైనా ఫార్చూన్ ల్యాండ్ డెవలప్‌మెంట్ కంపెనీ (సిఎఫ్‌ఎల్‌డిసి) ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఇండియాలో కొత్తగా ఇండస్ట్రియల్ సిటీని అభివృద్ధి చేసే అలోచనలో ఉన్నట్టు సిఫ్‌ఎల్‌డి అసిస్టెంట్ ప్రెసిడెంట్ జింగ్, ఇండియా కన్సల్టెంట్ సోని బడిగ తెలిపారు. తెలంగాణలో సిఎఫ్‌ఎల్‌డిసి పెట్టుబడులకు గల అవకాశాలపై పరస్పరం చర్చించుకున్నారు.

చైనాలో పారిశ్రామిక నగరాల అభివృద్ధిలో ఈ సంస్థ కీలక భూమిక పోషించింది. టెక్నాలజీ సిటీస్, ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేసింది. 16.7 బిలియన్ అమెరికన్ డాలర్ల సిఎఫ్‌ఎల్‌డిసి కంపెనీ తెలంగాణ పట్ల ఆసక్తి చూపినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. చైనా రైల్వే కార్పొరేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు.

చైనా రైల్వే కార్పొరేషన్ (సిఆర్‌సి) చైనాలో రైలు, విమాన సేవలు అందిస్తోంది. 5,700 రైల్వే స్టేషన్లలను నిర్వహిస్తోంది. కన్‌స్ట్రక్షన్ కంపెనీ సానితో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. రోడ్ల నిర్మాణం, పోర్టుల నిర్మాణ రంగంలో చైనాలో సాని కంపెనీ ప్రముఖమైనది. చైనాలోని టాప్ 500 కంపెనీల్లో ఇది ఒకటి.

అనంతరం ముఖ్యమంత్రి చైనాలోని ఫర్‌బిడెన్ నగరాన్ని సందర్శించారు. చారిత్రాత్మకమైన ఈ ప్రాంతంలోని అప్పటి రాజ వంశీయుల ప్యాలెస్‌లను మ్యూజియంలుగా మార్చారు. 180 ఎకరాల్లో 980 భవనాలు నిర్మించారు.

English summary
In spite of his busy schedule in Easter nation, Chief Minister K Chandrasekhar Rao today made a visit to some historic structures and monuments in China including “Forbidden City” located in Central Beijing along with his delegation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X