రాజకీయాల్లో పరిపక్వత ఆయన సొంతం.!కేసీఆర్ కు కేటీఆర్ కు అదే తేడా.!
హైదరాబాద్: రాజకీయాల్లో వారిద్దరూ తండ్రీ కొడుకులైనప్పటికీ ఒకరి ఆలోచనకు మరొకనరి ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆ అంశాన్ని స్పష్ట చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విధానాలు రాజకీయ పరంగా ఉంటే ఆయన కుమారుడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విధానాలు అందుకు భిన్నంగా ఉంటాయి. రాజకీయాల్లో ఎదురులేని పటిష్టత కేసీఆర్ సొంతం ఐతే యువత మేథస్సుకు పదును పెంచి బలమైన సమాజ నిర్మాణం జరగాలన్నది కేటీఆర్ అభిమతంగా స్పష్టం అవుతోంది.మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్బంగా వన్ ఇండియా ప్రత్యేక కథనం.

పటిష్టమైన యువ సమాజం కావాలి..
విదేశాల్లో విద్యను ఆర్జించిన మంత్రి కేటీఆర్ తన ఆలోచనలు కూడా అంతే విశాలంగా ఉంటాయి. రాజకీయాల్లో వినూత్న మార్పులు జరుగడం సర్వసాధారణం, కాని అవకాశం వచ్చినప్పుడు దేశ యువతకు అవకాశాలు కల్పించడంలో వెనకడుగు వేయొద్దనేది మంత్రి కేటీఆర్ ఉద్దేశంగా తెలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా యువత ప్రతిభను గుర్తించి అందుకు తగ్గ సాంకేతికతను అందివ్వగలిగినప్పుడే పదవులకు గానీ, అదికారానికి గాని పరమార్థం అని ధోరణిలో కేటీఆర్ సమాలోచనలు జరుపుతుంటారు.

ఐటీ కంపేనీలను శాసిస్తుంది భారతీయులే..
దేశంలోని యువత గురించి, వారి నైపుణ్యం పెంపు. స్వదేశీ అవకాశాల కల్పన గురించి కేటీఆర్ నిత్యం ఆలోచిస్తుంటారు. దేశానికి చెందిన అనేక మంది సాంకేతిక నిపుణులు విదేశీ సంస్థలకు సీఈవోలు పనిచేస్తున్నారని, భారత మేథో సంపత్తిని విదేశీ సంస్థలకోసం వినియోగిస్తున్నారని, అవే అవకాశాలు భారత దేశంలో కల్పించగలిగితే సాంకేతిక పరిజ్ణానం ఉన్న ఎంతో మంది నిపుణులు దేశంలోనే సత్తా చాటుకునే అవకాశం ఉంటుందనేది మంత్రి కేటీఆర్ అభిమతంగా తెలుస్తోంది. ఆర్థిక రంగంతో పాటు అనేక రంగాలు బలోపేతం అవ్వడంతో పాటు మారుతున్న కాలం ప్రకారం ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించాలనేది కేటీఆర్ లక్ష్యంగా తెలుస్తోంది.

రాజకీయాలు అవకాశాలు వస్తుంటాయి పోతుంటాయి.
రాజకీయాలకు అతీతంగా పటిష్టమైన నవ సమాజ నిర్మాణం కోసం తారక రామారావు ఆలోచిస్తారు తప్ప రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు, రాజకీయాల్లో అణచివేత ధోరణ ఇలాంటి అంశాల జోలికి కేటీఆర్ వెళ్లరనేది అనేక సందర్బాల్లో రుజువైంది. పారదర్శక రాజకీయాలు నెరుపుతూనే రాష్ట్రం సమగ్ర, సత్వర అభివ్రుద్ది జరగాలని కేటీఆర్ ఆకాంక్షిస్తుంటారు. అంతే కాకుండా దిగ్గజ ఐటీ కంపెనీలను నడిపిస్తున్న భారతీయ మేధావులను స్పూర్తిగా తీసుకుని యువతను ఆ దిశగా ప్రేరేపించాల్సిన బాద్యత ప్రస్తుత రాజకీయ నాయకుల మీద ఉందని మంత్రి కేటీఆర్ చెప్పుకొస్తుంటారు.

కేసీఆర్ కు కేటీఆర్ కు వ్యత్యాసం..
మంత్రి కేటీఆర్ ఆలోచనలకు, సీఎం చంద్రశేఖర్ రావు ఆలోచనలకు స్పష్టమైన తేడా ఉందని తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతోంది. కేసీఆర్ విలేఖరుల సమావేశంలో రాజకీయాలు, దూషణలు, రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు తప్ప మరో అంశాలు ఉండవని, అదే కేటీఆర్ విలేఖరుల సమావేశాల్లో యువతకు, నిరుద్యోగులకు, సాంకేతిక నిపుణులకు, యువ వ్యాపార వేత్తలకు, విదేశీ పెట్టుబడి దారులకు, క్రీడాకారులకు, సినీ పరిశ్రమ వారికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కేటీఆర్ వివరిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. విదేశాల్లో చదువుకున్న తన ఆలోచనా పరిది కూడా అంతే విశాలంగా ఉంటుందనే అంశంపై లోతైన చర్చ జరగుతోంది.
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications