మంత్రి కేటీఆర్ ఆపన్న హస్తం .. ఒక చిన్న ట్వీట్ తో ఒక చిన్నారికి పునర్జన్మనిచ్చిన కేటీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆయన తనకు సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ఏదైనా ఫిర్యాదు చేసినా, అభ్యర్ధన చేసినా సరే స్పందిస్తారు. ఇదే క్రమంలో ఓ చిన్నారికి పునర్జన్మ ఇచ్చిన వారయ్యారు మంత్రి కేటీఆర్ .

అక్షయ అనే చిన్నారికి వైద్యం కోసం కేటీఆర్ కు తల్లిదండ్రుల విజ్ఞప్తి

అక్షయ అనే చిన్నారికి వైద్యం కోసం కేటీఆర్ కు తల్లిదండ్రుల విజ్ఞప్తి

ట్విట్టర్ వేదికగా ప్రాణాంతక నియో ప్లాస్టిక్ తో బాధపడుతున్న రెండేళ్ల తమ బిడ్డకు ఆపరేషన్ చేయించటానికి తమకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో సదరు చిన్నారి తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్ కు తమ చిన్నారిని కాపాడాలని కోరుతూ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. అందుకు వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఉచితంగా చిన్నారికి చికిత్స చేయాలని కోరుతూ ఆసుపత్రి వర్గాలకు రీట్వీట్ చేశారు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు నిలబడ్డాయి.

 ఉచితంగా ఆపరేషన్ చెయ్యాలని కోరిన కేటీఆర్ ... చిన్నారికి ఆపరేషన్ చేసిన వైద్యులు

ఉచితంగా ఆపరేషన్ చెయ్యాలని కోరిన కేటీఆర్ ... చిన్నారికి ఆపరేషన్ చేసిన వైద్యులు

ప్రాణాంతకమైన నియో ప్లాస్టిక్ వాపుతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి అక్షయ కు నల్లగండ్ల లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వైద్యులు ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించారు. మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు పాప పరిస్థితి వివరించారు. ఏడాదిన్నర కాలంగా బేబీ అక్షయ మెడ వద్ద వాపుతో బాధపడుతోందని, తల్లిదండ్రులు చికిత్స కోసం ఇటీవల అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లోని రోబోటిక్ సర్జన్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ ను సంప్రదించారని అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారి మెడపై 8.5 సెంటీ మీటర్ల విస్తీర్ణంలో గడ్డ ఉందని వెల్లడించారని చెప్పారు.

మెడపై చిన్నారికి పెద్ద గడ్డ .. ప్రాణాంతక గడ్డ తొలిగించాలని వైద్యుల సూచన

మెడపై చిన్నారికి పెద్ద గడ్డ .. ప్రాణాంతక గడ్డ తొలిగించాలని వైద్యుల సూచన

అది గుండె నుండి మెదడుకు , ఇతర భాగాలకు రక్తం సరఫరాకు అడ్డంకిగా మారిందని వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించి ఆ గడ్డను తొలగించాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు. అయితే ఆ చిన్నారి ఆపరేషన్ కి అయ్యే ఖర్చు భరించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన తల్లిదండ్రులు కేటీఆర్ తమ అభ్యర్థనకు స్పందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆయన చిన్నారికి ఉచితంగా చికిత్స చేయాలని ఆసుపత్రిని కోరుతూ రీట్వీట్ చేయగా ఆస్పత్రి వైద్యులు స్పందించారు.

పైసా కూడా తీసుకోకుండా ఖరీదైన ఆపరేషన్ చేసిన వైద్యులు .. కేటీఆర్ కు థాంక్స్

పైసా కూడా తీసుకోకుండా ఖరీదైన ఆపరేషన్ చేసిన వైద్యులు .. కేటీఆర్ కు థాంక్స్

ఆసుపత్రి వైద్యులు ఎంతో ఖరీదైన ఈ శస్త్రచికిత్సను పైసా కూడా తీసుకోకుండా నిర్వహించారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటోందని చెప్పారు. ఇక ఇదే విషయాన్ని సదరు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. తమ బిడ్డకు ప్రాణదానం చేసిన వైద్యులకు, ఉచితంగా ఆపరేషన్ చేయడానికి తమకు కావలసిన సహాయం అందించిన కేటీఆర్ కు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ చేసిన చిన్న ట్వీట్ ఒక చిన్నారికి ప్రాణ దానం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+