విషాదం:పెళ్ళై 6 మాసాలకే ఇలా..కారణమేమిటీ?

Posted By:
Subscribe to Oneindia Telugu

నిజామాబాద్: పెళ్ళై ఆరు మాసాలైంది.కాని, భార్య,భర్తల మద్య వివాదాలు కొనసాగుతుండడడంతో భర్త ఆత్మహత్య చేసుకొన్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది.

నిజామాబాద్ పట్టణంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన రాజేశ్వరికి మహారాష్ట్రకు చెందిన మహేందర్ తో ఆరు మాసాల క్రితం వివాహమైంది.

అయితే వారు ప్రస్తుతం హమల్ వాడి సాయిబాబా ఆలయం సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అయితే వివాహమైన కొద్దిరోజుల నుండే దంపతుల మధ్య తరచూడ గొడవలు జరగుతున్నాయి. ఈ క్రమంలో భార్య పది రోజు క్రితమే భర్తను వదిలి పుట్టింటికి వెళ్ళింది.

mahendar suicide in nizambad district

ఈ నేపథ్యంలోనే మహేందర్ బుదవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించాడు. గది నుండి పొగలు రావడంతో గమనించిన ఇంటి యజమాని అక్కడకు వెళ్ళి చూడగా మహేందర్ మంటల్లో కాలిపోతూ కన్పించాడు. అయితే అతడిని కాపాడే ప్రయత్నం చేయడగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

మహేందర్ మృతికి కారణాలు తెలియరాలేదు. మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
mahendar suicide in nizambad district.mahendar married rajeshwari six months back, she has went to her home town 10 days back. mahendar suicide on wednesday
Please Wait while comments are loading...