హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

BJP.. ప్లాన్ A లేదంటే ప్లాన్ B!

|
Google Oneindia TeluguNews

భారతీయ జనతాపార్టీ ప్రణాళికలు అంత తొందరగా అర్థం కావు. ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా, ఏ రాష్ట్రంలో తాను పాగా వేయాలనుకున్నా దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేస్తుంది. అప్పటికప్పుడే ఫలితాలు కావాలని ఆశించదు. కొన్నాళ్ల తర్వాతే బీజేపీ నాటిన ప్రణాళికా మొక్కకు కాయలు కాయడం ప్రారంభిస్తాయి. అప్పుడు అధిష్టానం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతుంది.

ఓడినా.. గెలిచినా.. బీజేపీయే

ఓడినా.. గెలిచినా.. బీజేపీయే


మునుగోడు ఉప ఎన్నిక కూడా అంతే. వాస్తవానికి ఇక్కడ నెగ్గినా విజేత బీజేపీనే.. ఓడినా విజేత బీజేపీయే. తెలంగాణ గెలుచుకోవాలనే తన దీర్ఘకాలిక వ్యూహానికి మునుగోడును పునాదిగా ఉపయోగించుకుంది. ఆ పార్టీకి ఉత్తర తెలంగాణలో చెప్పుకోదగిన సంఖ్యలో బలమైన నాయకులు ఉన్నారు. కానీ దక్షిణ తెలంగాణలో అసలు లేరు. రాష్ట్రం నలుమూలలా పార్టీకి బలమైన అభ్యర్థులున్నారని ప్రజల్లో నిరూపించుకునేందుకు, పార్టీలో జోష్ తెచ్చేందుకు ఈ ఉప ఎన్నికను ఉపయోగించుకుంది.

బరిలో నిలవాలంటే పునాది వేయాలి

బరిలో నిలవాలంటే పునాది వేయాలి

తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. బరిలో నిలవాలంటే ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటూ రావాలి. దక్షిణ తెలంగాణలో పునాది వేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో ఇక్కడ 12వేల ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి అధికార పార్టీకి భయం పుట్టించేలా వ్యవహరించింది. రాజగోపాల్ రెడ్డి బలమైన నేత కావడంతో అధికార టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటోంది.. ఓట్లు రాబడుతోంది.

ఒక్క ఉప ఎన్నికతో అనేక లక్ష్యాలను చేరుకున్న బీజేపీ?

ఒక్క ఉప ఎన్నికతో అనేక లక్ష్యాలను చేరుకున్న బీజేపీ?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత బలంతో ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ బీజేపీకి కలిసివచ్చే అంశాలు ఇంకా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ తో హోరాహోరీగా పోరు సాగించే సత్తా ఒక్క బీజేపీకే ఉందనే ప్రచారాన్ని ప్రజల్లోకి పంపించగలిగింది. అందుకు రుజువుగా మునుగోడును చూపించబోతోంది.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రజల్లో నానేలా చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ తర్వాతే కాంగ్రెస్ పార్టీ అని నిరూపించింది. ఒక్క మునుగోడు ఉప ఎన్నికతో అనేక లక్ష్యాలను బీజేపీ చేరుకుందని చెప్పవచ్చు. సాధారణ ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం కమలం పార్టీయే అని ప్రజల్లోకి తీసుకువెళ్లింది.

మునుగోడులో 2014 ఎన్నికల్లో బీజేపీకి 27వేల ఓట్లు రాగా 2018లో కేవలం 12వేలే వచ్చాయి. ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించడానికి, బలమైన నేతల కోసం బీజేపీ గాలమేసే అవకాశం ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఉన్న అసమ్మతి నేతలపై గురిపెడుతుంది. టికెట్లు ఇస్తాననే నమ్మకాన్ని వారికి కల్పిస్తే చేరికలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

English summary
Bharatiya Janata Party's plans are not understood so quickly.It will implement a long-term strategy in whichever state it chooses to enter, whatever state it chooses to hold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X