వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బురద నుంచి వచ్చిన తామర, దమ్మున్న మగాడు, నాకు ట్యాక్స్ వేశాడు: మోడీపై నాగబాబు (వీడియో)

మెగా సోదరుడు నాగబాబు ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు పలికారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దును నాగబాబు స్వాగతించారు. ఇందుకు సంబంధించి దాదాపు అరగంట నిడివి ఉన్న వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెగా సోదరుడు నాగబాబు ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు పలికారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దును నాగబాబు స్వాగతించారు. ఇందుకు సంబంధించి దాదాపు అరగంట నిడివి ఉన్న వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

వీడియోలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని, దేశ పురోగతిని మార్చే ఏ నిర్ణయం తీసుకోవడానికి ఎవరికీ దమ్ము లేదు. ఒకవేళ మెజార్టీ ఉన్నా సరే నిర్ణయం తీసుకోలేనటువంటి ప్రధానమంత్రులు ఉన్నారు. దేశం కరప్షన్‌తో కుళ్లుపోయి, చచ్చిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మనకు విపరీతమైన స్వేచ్ఛ ఉన్న దేశం మనది, అంత విపరీతం మనకు ఎక్కువైపోయిందన్నారు. బురద, మట్టి అలాంటి వాటిల్లో నుంచి తామర పూవు వస్తుందన్నారు. అలాంటి కుళ్లిపోయిన సమాజం నుంచి ఓ గొప్పోడు పుడతాడన్నారు. అది చాలా గొప్ప, రేర్ విషయమన్నారు.

నియంత కావాలి

అసలు భారత దేశాన్ని పరిపాలించేందుకు ఓ నియంత కావాలన్నారు. మోడీ పెద్ద నోట్ల రద్ద ప్రకటనను తాను గర్వంగా ఫీల్ అయ్యానని చెప్పారు. మన దేశం ఇంత కాలానికి ఓ అద్భుతాన్ని చూస్తోందన్నారు. డబ్బులిచ్చి ఓట్లేయించుకొని గెలిచే రాజకీయ నాయకులు డబ్బుల గురించే మాట్లాడుతారన్నారు.

డెబ్బై ఏళ్ల తర్వాత.. దమ్మున్న మగాడు

ఇంచుమించు డెబ్బై ఏళ్ల తర్వాత ఈ దేశం బాగుపడటానికి తీసుకున్న అద్భుత నిర్ణయం అన్నారు. తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రధాని మోడీ కాదన్నారు. చావో రేవో తేల్చుకునే దమ్మున్న మగోడు అన్నారు. దటీజ్ మోడీ అన్నారు. కాగా, నాగబాబు ఇది 'నా ధృక్కోణంలో' అని చెబుదామని చాలా రోజుల నుంచి అనుకున్నానన్నారు.

ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన నోట్ల రద్దుపై మాట్లాడాలని అనిపించిందని తెలిపారు. ఇందులో నేను చెప్పేది నాకే బాగా తెలుసునని, నేనే తెలివివంతుడినని చెప్పడం లేదన్నారు. కేవలం తన అభిప్రాయం చెబుతున్నానని, తనకు తెలిసిందని చెబుతున్నారు.

నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న మోడీ గురించి తప్పకుండా మాట్లాడాలన్నారు. దీని వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇదేనా ప్రభుత్వం అంటే అనే విమర్శలు వస్తున్నాయన్నారు. సామాన్యులతో పాటు నేను కూడా కొంత ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు.

Naga Babu Fires on Corruption in India

నేను మోడీ అభిమానిని కాదు..

నేను మొదటగా చెప్పాలనుకున్నది ఏమంటే నేను మోడీ అభిమానిని కాదని చెప్పారు. మన ప్రధాని మోడీ అభిమానిని కాదని, బీజేపీ సభ్యుడిని కాదన్నారు. ఓ విధంగా చెప్పాలంటే నేను కాంగ్రెస్ సాధారణ సభ్యుడిని అన్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, ఆయనతో పాటు మేం కూడా చేరామన్నారు.

నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆయన తప్పులను ఎత్తి చూపాలని, మోడీని విమర్శించాలని లేదన్నారు. మంచి ఎవరు చేసినా మనం మెచ్చుకోవాలన్నారు.

మోడీపై విమర్శలపై..

మోడీ నోట్ల రద్దు పైన ముందే ప్రకటించి ప్రజలకు పది రోజుల సమయం ఇస్తే బాగుండునని చాలామంది చెబుతున్నారని గుర్తు చేశారు. అప్పుడు ఇబ్బందులు ఉండకపోయేవని అంటున్నారని తెలిపారు.

మరో విమర్శ, మోడీ.. అదానీ, అంబానీలకు ముందే చెప్పారని కూడా విమర్శిస్తున్నారన్నారు.

ఇది ఏకపక్ష నిర్ణయం అని కూడా విపక్షాలు అంటున్నాయన్నారు. దేశంలో రూ.2000 నోట్లు పెడితే ముందు ముందు బ్లాక్ మనీ అవ్వదా అని కొందరు విమర్శిస్తున్నారన్నారు.

కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు సబ్సిడీలు వంటివి ఇచ్చాయని, కానీ దేశ పురోగతిని మార్చే దమ్మున్న నిర్ణయాలు తీసుకున్న ప్రధాని లేరన్నారు. నెహ్రూ, ఆ తర్వాత ఇందిరా గాంధీ కొద్దో గొప్పో బలమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఆ తర్వాత పీవీ నర్సింహ రావు ఒక లెవల్ నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అనంతరం వాజపేయి బ్రహ్మాండమైన రోడ్లు తదితర మంచి పనులు చేశారన్నారు.

నెహ్రూ నుంచి వాజపేయి వరకు ఎవరికి మంచి నిర్ణయం తీసుకుందామంటే కుదరలేదన్నారు. నేను చిన్నప్పటి నుంచి అనుకునే వాడినని, భారత దేశానికి ఓ నియంత కావాలని అనుకునేవాడినన్నారు. ఎవరినైనా తిట్టవచ్చు... విమర్శించవచ్చన్నారు. మన దేశంలో స్వేచ్చ ఎక్కువన్నారు.

ప్రజాస్వామ్యంలో నుంచి మంచి మనసు ఉన్న, కఠిన నిర్ణయాలు తీసుకోగలిగిన ఒక్కడైన వస్తాడా అని తాను తొలిసారి ఓటేసినప్పటి నుంచి, అంటే నలభై ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్నానని చెప్పారు. ఇన్నేళ్లకు మోడీలా గొప్ప పీఎం వచ్చారన్నారు.

ట్రంప్ గురించి చూస్తుంటే..

ట్రంప్ ఎన్నికల గురించి నేను చూస్తుంటే హఠాత్తుగా మోడీ ప్రసంగం వచ్చిందన్నారు. ఇదేంటి ఇలా ప్రసంగం వచ్చిందని అర్థం కాలేదన్నారు. నోట్ల రద్దు గురించి విని.. అది గొప్ప నిర్ణయం అనిపించిందన్నారు. దీంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని అందరూ అంటున్నారన్నారు.

విశాఖలో హుధుద్ తుఫాను వచ్చినప్పుడు బియ్యం దొరికితే చాలు అన్నం తిందామనుకున్నారని, చెన్నైలో నెల రోజులు ఇబ్బందులు పడ్డారని, ఇవన్నీ మనం భరించలేదా అన్నారు. ఏదోై విధంగా డబ్బులు వస్తున్నాయని, ఎంతో కొంత వస్తున్నాయి కదా అన్నారు. బ్యాంకులు బాగా పని చేస్తున్నాయన్నారు.

ఈ ఇష్యూను కూడా (నోట్ల రద్దు) కరెప్ట్ చేసేవాళ్లు ఉంటారని, ప్రతిచోట వెదవలు ఉంటారని అన్నారు. మన ప్రశ్న అధి కాదన్నారు. దాంతో ప్రయోజనం ఆలోచించాలన్నారు. ఇందిర హయాంలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు.. మనిషి నోరెత్తి మాట్లాడే అధికారం లేకుండా చేశారన్నారు. అప్పుడు భరించారు కదా అన్నారు. అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకన్నారు.

తన టర్మ్ అంతా ఇలాగే కష్టాలతో ఉండమని మోడీ చెప్పారు. ఓ యాభై రోజులు ఇలా ఉండమన్నారు. ఆ మాత్రం మోడీకి మద్దతు ఇవ్వలేమా అన్నారు. మగాడు, దమ్మున్న నాయకుడు అని ప్రశంసించారు. యాభై రోజులు ఇబ్బంది పడితే ఏమిటన్నారు. మా సినిమాలు కూడా కొన్ని రోజుల పాటు ఆడవు.. నష్టమేమిటన్నారు.

తిట్లకు భయపడడు

ఇంతకాలం ఏ ప్రధానిని.. మోడీని తిట్టినంత దారుణంగా ఎవరు తిట్టలేదన్నారు. మంచి చేస్తున్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు కూడా తిడుతాం అన్నారు. ఆయన ఎన్నో తిట్లు తిన్నారన్నారు. ఆయన ఈ తిట్లకు భయపడడని, మాటలకు భయపడడని చెప్పారు.

తిట్టుకుంటారని ఆ రోజే చెప్పారు

ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే చెప్పారని, నేను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటానని, దాంతో ప్రజలు నన్ను తిట్టుకోవచ్చునని అన్నారని గుర్తు చేశారు. బహుశా ఆయన మైండులో ఇలాంటి నిర్ణయాలు అప్పుడే ఉండి ఉండవచ్చునని చెప్పారు.

మోడీ హయాంలో వ్యాట్, సర్వీస్ ట్యాక్సులు కూడా పెరగవచ్చునని చెప్పారు. ఇదేమిట్రా అనుకున్నామని, కానీ ఈ నిర్ణయం (నోట్ల రద్దు)తో వచ్చే ప్రయోజనం అంతా ఇంతా కాదన్నారు. మార్పు వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని చెప్పారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారి, డెబ్బై ఏళ్ల తర్వాత ఈ దేశం బాగుపడేందుకు తీసుకున్న అద్భుత నిర్ణయం అన్నారు.

విమర్శలపై..

రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై కొన్ని రోజుల ముందే చెబితే హవాలాలో, డాలర్లలో పెట్టుకొని బయటపడే వారన్నారు. మనిషి బతికుండాలంటే క్యాన్సర్ వచ్చిన కాలును తీసేస్తారని, అలాగే దేశం కోసం ఇలాంటి నిర్ణయాలు కావాలన్నారు. కరప్షన్ అనే దరిద్రాన్ని తొలగించాలంటే బాధను భరించాలన్నారు. బాధ బరించకుండా సంతోషంగా కూర్చొని, అన్ని సదుపాయాలు కల్పించాలంటే ఎలా అన్నారు.

రూ.500, రూ.1000 నోట్లు రద్దు చిత్తు కాగితాలతో సమానమన్నారు. మోడీ గ్రేట్ అన్నారు. నా వద్ద కూడా కొంత డబ్బు ఉందన్నారు. దానిని ఏం చేసుకోవాలని అన్నారు. దానిని తర్వాత లెక్కలు చూపించి బ్యాంకులో వేసుకుంటానని చెప్పారు.

నాకు పన్ను వేశారు

మోడీ ఎవరి డబ్బులు తీసుకోలేదని, లెక్కలు చూపించి డబ్బులు వేసుకోమని చెప్పారన్నారు. మోడీ పన్నులు వేశారంటే.. మాలాంటి వాళ్లకు వేశారన్నారు. నేను కొంత ఉన్నవాడినని, నా కన్నా గొప్పవాళ్లకు పన్ను వేశాడన్నారు. అందులో తప్పు ఏమిటన్నారు.

ప్రక్షాళనకు ఒక్కడొచ్చుడు

ప్రక్షాళన చేసేందుకు ఒక్కడు వచ్చాడన్నారు. అయినవాళ్లకు ముందే చెప్పాడని చెప్పడం సరికాదన్నారు. అదానీ, అంబానీలకు చెప్పినట్లు ఎవరైనా చూశారా అన్నారు. ఆ రోజు ఆయన జెన్యూన్‌గా ప్రకటన చేశారన్నారు. నేను నమ్ముతున్నానని చెప్పారు. ముందే చెప్పి ఉంటే.. అదంతా బయటకు లీక్ అయ్యేదే కదా అన్నారు. మన దేశంలో ఓ మనిషి నుంచి మరో మనిషికి విషయం వెళ్లేందుకు 24 గంటలు చాలన్నారు. మీడియా కూడా అవసరం లేదన్నారు. అలాగే మోడీ లీక్ చేస్తే అందరికీ తెలిసేది కదా అన్నారు.

చంద్రబాబుకు చెప్పారని ఒకరు, అంబానీకి చెప్పారని మరొకరు, అదానికి చెప్పారని ఇంకొకరు చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. కొందరు ముందు ఊహించి ఉండవచ్చునని, జాగ్రత్త పడి ఉండవచ్చునని చెప్పారు. మోడీ ముందే నల్ల ధనం కలిగి ఉన్న వారిని హెచ్చరించారన్నారు. 40 శాతంతో బ్లాక్ మనీ వైట్‌గా చేసుకోమని చెప్పారని, అప్పుడే ఎందుకు చెప్పలేదన్నారు.

English summary
Naga Babu Fires on Corruption in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X