Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఘరానా చైన్ స్నాచర్ పట్టివేత: తాళాలు పగులగొట్టి ఇంట్లో బంగారం చోరీ

హైదరాబాద్: గొలుసు దొంగతనాల్లో ఆరితేరిన ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న మురళీకృష్ణ అనే వ్యక్తిని వనస్థలిపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2014 నుంచి వనస్థలిపురంతో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో మురళీ గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

నిందితుడి నుంచి 25 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మురళీకృష్ణ 12 గొలుసు దొంగతనాల్లో నిందితుడు. వాహనాలు తనిఖీ చేస్తుండగా మురళీ పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.

 Noted chain snatcher nabbed by police

ఇదిలావుంటే హైదరాబాదులోని నాగోల్‌లోగల అరుణోదయనగర్‌లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న 38 తులాల బంగారం, రూ. 3 లక్షలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధిత కుటుంబం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుడు నరువ మండలం ఉందేకోడు గ్రామానికి చెందిన వెంకటయ్యగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+