వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఎఫ్‌సీకి ఆదిలోనే 'హైదరాబాద్' షాక్: కేంద్రంపై పవన్ దూకుడు, ఆర్టీఐ దరఖాస్తు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ సమావేశాన్ని హైదరాబాదులో నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

చదవండి: మోడీ నటిస్తే కనుక, కేవలం మంత్రమే: పవన్ కళ్యాణ్ హోదా డిమాండ్‌కు జేపీ షాక్

సమస్యలు ఏపీకి చెందినవి అయితే హైదరాబాదులో సమావేశం నిర్వహించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారట. పవన్ ప్రయత్నం మెచ్చుకోదగినదేనని, అయితే పక్క రాష్ట్రంలో ఏపీ సమస్యలపై చర్చించాల్సిన అవసరమేమిటని నిలదీస్తున్నారని తెలుస్తోంది.

చదవండి: పవన్‌తో కలిసి పని చేస్తానో లేదో, రాజకీయం అర్థం తెలియదు, నేనే రాజకీయాలు చేస్తున్నా: జేపీ

ఏపీ నుంచి పాలన సాగుతోంటే హైదరాబాదులోనా

ఏపీ నుంచి పాలన సాగుతోంటే హైదరాబాదులోనా

పవన్ కళ్యాణ్ ఏపీలో తిరిగి సమస్యలు తెలుసుకోవాలని కొన్ని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారట. ఏపీ పరిపాలన కూడా నవ్యాంధ్ర నుంచే సాగుతోందని, ఇలాంటప్పుడు హైదరాబాదులో భేటీ నిర్వహించడం సరికాదని అంటున్నారని తెలుస్తోంది.

అందుకే హైదరాబాదులో నిర్వహణ

అందుకే హైదరాబాదులో నిర్వహణ

అయితే, ఈ జెఎఫ్‌సీ కేవలం ఏపీ సమస్యల కోసమే కాదని, రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం పోరాడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా జేఎఫ్‌సీ భాగమైన వివిధ రంగాలకు చెందిన నిపుణులు హైదరాబాదులో నివాసం ఉన్నారని, వారిలో పలువురు పెద్దవారు ఉన్నారని, వారికి ఇబ్బంది కలగకుండా ఈ సమావేశాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

20 మంది సంతకాలు

20 మంది సంతకాలు

మరోవైపు, పవన్ నేతృత్వంలోని జేఎఫ్‌సీ నిధుల లెక్క కోసం సమచార హక్కు చట్టాన్ని ఆశ్రయించింది. ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగింది. విభజన చట్టం ప్రకారం వివిధ ప్రాజెక్టులకు ఇచ్చిన నిధుల వివరాలు తెలపాలని కోరింది. సహ హక్కు చట్టం దరఖాస్తుపై పవన్, జేపీ, ఉండవల్లి సహా 20 మంది సంతకాలు చేశారు.

వారంలో నిజాలు చెబుతాం

వారంలో నిజాలు చెబుతాం

అంతకుముందు జేఎఫ్‌సీ సభ్యులు మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని ఇప్పటికే వివరాలు అడిగామని, అవి వచ్చాక ప్రకటన చేస్తామని చెప్పారు. అధికారిక కేటాయింపులు, హామీల అమలుపై కేంద్రం ప్రకటన చేయాలన్నారు. రేపటి సమావేశాన్ని పద్మనాభయ్య ఏర్పాటు చేస్తారన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసమే జేఎఫ్‌సీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. వారంలో నిజాలు చెబుతామన్నారు.

English summary
Jana Sena Chief Pawan Kalyan has speeded up the political activities after forming Joint Fact-Finding Committee with some of the political experts and others having efficiencies in various fields.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X