శుభలేఖ ఇచ్చేందుకు వచ్చి వివాహితపై అత్యాచారయత్నం, పెళ్ళి జరిగేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పెళ్ళి కార్డు ఇచ్చేందుకు వెళ్ళిన ఓ ప్రబుద్దుడు ఓ వివాహితపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.అయితే నిందితుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే ఈ ఘటనతో వివాహిత కాపురంలో చిచ్చురేగింది. మరో వైపు నిందితుడి పెళ్ళి పై నీలినీడలు కమ్ముకొన్నాయి.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి గత ఏడాది అదే మండలానికి చెందిన యువకుడితో వివాహమైంది. పూర్వాశ్రమంలో ఆమె స్వగ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే స్నేహితుడికి ఇటీవల పెళ్ళి కుదిరింది.

Rape attempt on a lady in Shamshabad

తన పెళ్ళి శుభలేఖ ఇచ్చేందుకు శ్రీనివాస్ శనివారం సాయంత్రం వివాహిత ఇంటికి వెళ్ళాడు. అత్తగారింట్లో ఆమె ఒంటరిగా ఉంది. అయితే ఈ అవకాశాన్ని తీసుకొన్న శ్రీనివాస్ వివాహితపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.

ఆమె కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. శంషాబాద్ గ్రామీణ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనుహ్యాంగా చోటుచేసుకొన్న ఈ ఘటనతో వివాహిత కుటుంబంలో కలతలు రేగాయి. ఈ ఘటనతో నిందితుడిపై నిర్భయ కేసు నమోదైంది. వివాహం జరుగుతోందా లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rape attempt on a lady in Shamshabad on Sunday.Srinivas rape attempt on a lady.He was went to her house to give wedding invitation.She complaint against him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి