హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్‌లో ఆ భయం? సోనియా బర్త్‌డే ముహూర్తం: ఎలా హైలెట్ అయ్యారో చెప్పిన ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని మీడియానే హీరోగా చేసిందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరాక రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

Recommended Video

రేవంత్‌లో ఓటమి భయం : డిసెంబర్ 9న ముహూర్తం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని మీడియానే హీరోగా చేసిందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరాక రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై టీఆర్ఎస్, టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

రేవంత్ గెలుపు వెనుక మేమే, మమ్మల్ని బేరంపెట్టాలని, పీసీసీ చీఫ్‌పై కన్ను: ఎమ్మెల్యే సంచలనం రేవంత్ గెలుపు వెనుక మేమే, మమ్మల్ని బేరంపెట్టాలని, పీసీసీ చీఫ్‌పై కన్ను: ఎమ్మెల్యే సంచలనం

 రేవంత్‌ను ఇలా హైలెట్ చేసారు

రేవంత్‌ను ఇలా హైలెట్ చేసారు

బాహుబలి వంటి టైటిల్స్‌తో రేవంత్ రెడ్డిని మీడియా హైలెట్ చేసిందని టీఆర్ఎస్ నేత నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. కానీ అదే మీడియా ఆయన తన ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదో అడగడం లేదని ప్రశ్నించింది.

 రేవంత్ స్పీకర్‌కు రాజీనామా ఇచ్చే అవకాశం లేదా?

రేవంత్ స్పీకర్‌కు రాజీనామా ఇచ్చే అవకాశం లేదా?

ఇప్పటికే తన రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకు ఇచ్చిన రేవంత్ తెలంగాణ స్పీకర్‌కు ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. రాజీనామా విషయంలో ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారని తేలిపోయిందని చెబుతున్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు రాజీనామాను ఫార్వార్డ్ చేయకుంటే స్పీకర్‌కు రాజీనామా సమర్పించవలసి ఉండె అంటున్నారు. ఇప్పటి వరకు దానిపై స్పందించలేదంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటో తేలిపోయిందని చెబుతున్నారు.

ఉప ఎన్నికలు తప్పించుకోవడమే

ఉప ఎన్నికలు తప్పించుకోవడమే

రేవంత్ వెంట చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఆయన అనుచరులు చాలామంది తెరాసలో చేరుతున్నారు. దీంతో రేవంత్‌లోను ఉప ఎన్నిక ఓటమి భయం పట్టుకున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన దూకుడుగా వ్యవహరించడం లేదని భావిస్తున్నారు.

 సాధ్యమైనంత వరకు సాగదీత

సాధ్యమైనంత వరకు సాగదీత

తన రాజీనామా అంశంపై సాధ్యమైనంత వరకు సాగదీత యోచనలో రేవంత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తప్పనిసరి పరిస్థితి వస్తే మాత్రం అప్పుడు తానే స్పీకర్‌కు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ సాధ్యమైనంత వరకు రాజీనామా చేయకపోవడమే ఉత్తమంగా భావిస్తున్నారని తెలుస్తోంది.

 సోనియా గాంధీ పుట్టిన రోజు నుంచి ప్రారంభం

సోనియా గాంధీ పుట్టిన రోజు నుంచి ప్రారంభం

రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఇప్పటి వరకు అధికారిక కార్యక్రమంలో పాల్గొనలేదు. అయితే డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు ముహూర్తం చూసుకున్నారని తెలుస్తోంది. ఆ రోజు నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారని సమాచారం.

English summary
Even though pressure is mounting on him to face the bypoll, Kodangal MLA A Revanth Reddy is unlikely to submit his resignation from the membership of the House directly to the Telangana Assembly speaker any time now. This means the possibility of a byelection seems remote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X