చంద్రబాబు క్లియర్: రేవంత్ రెడ్డి ఔట్, రమణ దూకుడు అదే...

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అవుటైనట్లే. చివరి నిమిషంలో పైచేయి కోసం ఇరు వర్గాలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణమ దూకుడు, రేవంత్ రెడ్డి పట్టు అందుకేనని అర్థమవుతోంది.

రేవంత్ రెడ్డి టిడిపిని వెళ్తూ వెళ్తూ చిక్కుల్లో పడేయాలనే వ్యూహంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన వ్యూహాన్ని దెబ్బ కొట్టడానికి రమణ ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో టిడిపి జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ స్పష్టతకు వచ్చినట్లు కనిపిస్తున్నారు.

ఆ స్పష్టత కారణంగానే రమణ దూకుడుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. రేవంత్ రెడ్డి విషయంలో చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే రమణ వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం (టిడిఎల్పీ) నేతగా గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆహ్వానాలు కూడా పంపించారు. అయితే, పార్టీ అధ్యక్షుడిగా రమణ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించే అర్హత లేదని ఆయన అంటున్నారు.

పోటీ సమావేశం...

పోటీ సమావేశం...

రేవంత్ రెడ్డి టిడిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం, బిజెపి శాసనసభ్యుల సమావేశాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డిని ఓ ఎమ్మెల్యేగా రమణ ఆహ్వానించారు. అయితే, ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి వెళ్తారా అనేది అనుమానమే. అయితే, టిడిఎల్పీ సమావేశం జరుగుతుందా అనేది కూడా చూడాల్సి ఉంది. టిడిపి ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారు.

వారొస్తారా, లేదా....

వారొస్తారా, లేదా....

రేవంత్ రెడ్డి గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి సండ్ర వెంకట వీరయ్య వస్తారా, లేదా అనేది చూడాల్సి ఉంది. కాంగ్రెసులోకి రేవంత్ రెడ్డితో పాటు వెళ్లే జాబితాలో ఆయన పేరు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన టిడిపిలో ఉంటారా, లేదా అనేది ఈ సమావేశాన్ని బట్టి తేలే అవకాశం ఉంది. మరో ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అసలు టీడిపి సమావేశాలకే హాజరు కావడం లేదు. అందువల్ల ఆయన వస్తారా, లేదా అనే చర్చ అంత ముఖ్యం కాకుండా పోయింది.

చంద్రబాబు వ్యూహం ప్రకారమే....

చంద్రబాబు వ్యూహం ప్రకారమే....

ప్రస్తుత తరుణంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తారనే గురువారం స్పష్టంగా బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన టిడిపిలో కొనసాగే అవకాశాలు మాత్రం లేవు. చంద్రబాబు ఆయనను సాగనంపడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు అర్థమవుతోంది. రమణ దూకుడు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ తురణంలో అందరి చూపూ రేవంత్ రెడ్డిపైనే ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It seems that Telugu Desam party chief and Andhra Pradesh CM Nara Chandrababu Naidu has decided to give a send of to TDP Telangana working president Revanth Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి