వీడియో: చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్.. దేశంలోనే తొలి సీఎంగా..
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా' లో భాగంగా హైదరాబాద్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. నగరంలోని ఉప్పల్ మైదానంలో ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ లో పాల్గొని యువ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపారు మెస్సీ. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది మెస్సీ జట్టు. దాంతో భారత్ లో మెస్సీతో ఫుట్ బాల్ ఆడిన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ఈ గేమ్ లో సింగరేణి ఆర్ఆర్ జట్టు తరఫున బరిలోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సి జట్టుపై 3-0 గోల్స్ తో సింగరేణి ఆర్ ఆర్ జట్టు విజయం సాధించడం విశేషం.
✨𝐀𝐧 𝐔𝐧𝐟𝐨𝐫𝐠𝐞𝐭𝐭𝐚𝐛𝐥𝐞 𝐌𝐨𝐦𝐞𝐧𝐭 ✨
— Congress (@INCIndia) December 13, 2025
Football's Greatest Of All Time Lionel Messi in Hyderabad. pic.twitter.com/5z5gXCKbG9
గోల్ కొట్టిన సీఎం రేవంత్..
హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి తన అసాధారణ ప్రతిభను కనబర్చారు. ఈ మ్యాచ్ లో 18వ నిమిషంలో గ్రౌండ్ లోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చీ రాగానే గోల్ కొట్టి అందరినీ ఆశ్చర్య పరిచారు. సీఎం గోల్ కొట్టడంతో స్టేడియం అంతా చప్పట్లతో దద్దరిల్లింది. అనంతరం మెస్సీ గ్రౌండ్ లోకి దిగారు. కాసేపు సీఎం రేవంత్ రెడ్డితో ఆట ఆడారు. మెస్సీ అభిమానుల కోసం స్టాండ్స్ లోకి బాల్స్ ను కిక్ చేశాడు. దాంతో ఫ్యాన్స్ మెస్సీ మెస్సీ అంటూ కేరింతలు, విజిల్స్ కొట్టారు. వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
𝐀𝐧 𝐔𝐧𝐟𝐨𝐫𝐠𝐞𝐭𝐭𝐚𝐛𝐥𝐞 𝐌𝐨𝐦𝐞𝐧t…#GOATIndiaTour #GOATIndiaTour2025 #Messi #MessiInIndia #TelanganaRising2047 pic.twitter.com/vCXz159jg3
— Revanth Reddy (@revanth_anumula) December 13, 2025
ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లతో కలిసి మెస్సీ, సీఎం రేవంత్ ఫొటోలు దిగారు. మ్యాచ్ అనంతరం విన్నర్, రన్నరప్ జట్లకు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి, ట్రోఫీలు అందించారు. ఈ కార్యక్రమంలో మెస్సీ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ వచ్చి తెలుగు ప్రజలను కలవడం సంతోషంగా ఉందన్నారు.

ఇక ఈ మ్యాచ్ చూడ్డానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకగాంధీ కుమారుడు, కుమార్తె ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించారు. మరోవైపు మెస్సీ రాకతో తెలంగాణ మాత్రమే కాకుండా యావత్ భారత్ మొత్తం క్రీడాకారులకు స్ఫూర్తిని నింపడమే కాకుండా ఫుట్ బాల్ క్రీడకు అపూర్వమైన గుర్తింపు లభించినట్లుగా చెప్పవచ్చు.
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!










Click it and Unblock the Notifications