దానిపై కెసిఆర్‌కు ప్రేమ, శంకరగిరి మాన్యాలు పట్టించారు: రేవంత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోళ్లపై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 24 గటల విద్యుత్తు వెలుగుల వెనక కెసిఆర్ చీకటి ఒప్పందాలున్నాయని ఆయన ఆరోపించారు.

రైతుల కోసం ఎంతైనా విద్యుత్‌ కొనుగోలు చేస్తామనే హామీ వెనుక రైతులపై కెసిఆర్‌కు ప్రేమ లేదని, కమీషన్‌పై మాత్రమే ప్రేమ ఉందని ఆయన అన్నారు. ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్తు కొనుగోళ్ల వెనక ఆంతర్యమేమిటోప్రభుత్వం చెప్పాలని ఆయన అన్నారు.

 కేంద్రం చెబుతున్నా కూడా..

కేంద్రం చెబుతున్నా కూడా..

తక్కువ ధరకే విద్యుత్‌ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా కెసిఆర్ ప్రభుత్వం మాత్రం ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు చేసుకుందని, అవన్నీ కూడా కమీషన్ కోసమేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిన, ప్రారంభించబోతున్న విద్యుత్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

 అధిక ధరలకు ఎందుకు..

అధిక ధరలకు ఎందుకు..

విద్యుత్తు తక్కువ ధరకు అందించడానికి అనేక సంస్థలు ఉన్నప్పటికీ ఎందుకు అధిక ధరలకు కొంటున్నారని రేవంత్ రెడ్డి అడిగారు. విద్యుత్ ఒప్పందాల కొనుగోళ్లను బయటపెట్టాలని కోరారు. అఖిలపక్షం నిర్వహించి విద్యుత్ కొనుగోళ్ల విషయం బయటకు చెప్పాలి. 24 గంటల విద్యుత్ కొనుగోళ్ల వెనుక అక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

 కావాలనే జగదీశ్వర్ రెడ్డిని..

కావాలనే జగదీశ్వర్ రెడ్డిని..

కావాలనే మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కెసిఆర్ పక్కన పెట్టారని, 24 గంటలు నిరంతర కరెంటు ఇస్తామని ముఖ్యమంత్రి డబ్బాలు కొడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.కొడంగల్ నియోజకవర్గంలో 18 తండాలకు నేటికి కరెంటు లేదని, సొంత శాఖలో పరిస్థితులను కూడా తెలియకుండా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారని ఆయన అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై బహిరంగ చర్చుకు కాంగ్రెస్‌ సిద్ధమని, విద్యుత్ మంత్రి బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు.

 ఆయన్ను అందుకే అాలా.

ఆయన్ను అందుకే అాలా.

తెలంగాణకు చెందిన రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్‌ రమేష్ సేవచేయడానికి వస్తే ఆయనను తిరిగి పంపించారని, తెలంగాణ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం సరిగా లేదన్నందుకు ఆయన్ను శంకరిగిరి మాన్యాలకు పంపించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇండియా బుల్స్ కంపెనీని కాపాడటానికి రోజువారీ కొనుగోళ్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ఇండియా బుల్స్‌పై కేసీఆర్‌కు ప్రేమ ఎందుకు పుట్టిందో చెప్పాలని, గుజరాత్ చెందిన కంపెనీపై ఎందుకు జాలి చూపిస్తున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leader Revanth Reddy has questioned Telangana CM K Chandrasekhar Rao on power purchases.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి