గన్‌మెన్లు సరెండర్ చేసిన రేవంత్‌రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన తనకు ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లను సరెండర్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారు.ఈ నిర్ణయం మేరకు ఆయన వెంటనే ఆయన గన్‌మెన్లను సరెండర్ చేయడానికి వికారాబాద్ వెళ్లారు. అక్కడ కలెక్టర్ కార్యాలయంలో ఆర్‌ఐ క్రాంతి కుమార్‌కు గన్‌మెన్ల సరెండర్ లేఖను అందించి, గన్‌మెన్లను అప్పగించారు.

కొడంగల్‌లో టిఆర్ఎస్ వ్యూహమిదే: రేవంత్‌కు అగ్ని పరీక్షేనా?

శనివారం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా చేశారు. . ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ ఆదివారం కొడంగల్‌లో తన అనుచరులతో సమావేశం అయ్యారు. తన భవిష్యత్ కార్యాచరణపై వారితో సంప్రదింపులు జరిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న టీఆర్ఎస్‌పై అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని రేవంత్ ప్రకటించారు.

Revanth Reddy surrenders gunman

టిడిపికి రాజీనామా చేసినందున రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై రేవంత్ కోర్టుల్లో కేసులు దాఖలు చేశారు. దరిమిలా రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.మరో వైపు ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇచ్చిన పిఎను కూడ రేవంత్‌రెడ్డి పంపించేశారు. దీనికితోడు నెలరోజుల్లోపుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తనకు కేటాయించిన ఎమ్మెల్యే క్వార్టర్‌ను కూడ ఖాళీ చేయనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Revanth Reddy surrendered his gunman to the government on Sunday.Revanth Reddy resigned to MLa post on Saturday. Revanth will vacate his MLA quarter within one month.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి