
Jaggareddy: ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సదాశివాపేట మండలం ఆత్మకూర్ గ్రామంలో డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో జగ్గారెడ్డి మాట్లాడారు. కష్టాలు, బాధలు, అవమానాలు మధ్య అంబేడ్కర్ చదువుకున్నారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. అంబేడ్కర్ విగ్రహం ప్రతి గ్రామంలో ఉండాలన్నారు.ఈ మహానీయుడి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని జగ్గారెడ్డి కోరారు. అంటరానితనమని నిర్ములించాలంటే విద్య ఒక్కటే మార్గమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. విద్యాతో జ్ఞానం వస్తుందని చెప్పారు. అప్పుడే ఎలాంటి బేధాలు లేకుండా ఉంటాయన్నారు.
అరుంధతి ఎస్సీ సామాజికవర్గమేనని చెప్పారు. అయితే పెళ్లి రోజు రెడ్డి అయినా, బ్రాహ్మణుడు అయినా.. ఎవరైనా అరుంధతి నక్షత్రం చూడాల్సిందేనని చెప్పారు.

కలియుగం వచ్చాకే కులాల మధ్య, మతాల మధ్య పంచాయితీ మొదలైందని తెలిపారు. హనుమంతుడుకి ఉన్న బలం గురించి చెప్పింది జాంబవంతుడేనని.. ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గమేనన్నాని జగ్గారెడ్డి వివరించారు. అలాంటి జాంబవంతుని కూతురు శ్రీకృష్ణుడిని పెళ్లాడిందని జగ్గారెడ్డి పురాణాలను చెప్పొకొచ్చారు."శ్రీరాముడు, అల్లా మధ్య ఏమైనా పంచాయితీ ఉందా..? ఎప్పుడైనా వారు ప్లొడాకున్నారా.. మీరు చూశారా..?" అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
కులాలు, మతాల మధ్య విద్వేషలు ఎందుకని నిలదీశారు. అందరు కలిసికట్టుగా జీవించాలని కోరారు. కాగా ఈ మధ్య జగ్గారెడ్డి ఎక్కువగా భక్తికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన అప్పట్లో భక్తి పాటలు కూడా పాడారు.