వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నను అంటే చెల్లికి మండదా మరి.!జగన్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన షర్మిళ.!

|
Google Oneindia TeluguNews

అశ్వరావుపేట/హైదరాబాద్ : మనమే సక్కగా లేనప్పుడు, పక్కవాడి మీద, అవతలి వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును, మంత్రి కల్వకుంట్ల తారాకరామారావును వైయస్సార్ టీపి అద్యక్షురాలు వైయస్ షర్మిళ సూటిగా ప్రశ్నించారు. ఇక్కడి సమస్యలను వదిలేసి ఏపీ సమస్యల గురించి ప్రస్తావించడం ఎంతవరకు సమంజసం అని నిలదీసారు.

పాదయాత్రలో బాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట నియోజకవర్గంలో షర్మిళ ప్రసంగించారు. ఆంధ్ర ప్రజల అంశం పక్కన పెడితే తెలంగాణ ప్రజలు ఎంత వరకు సంతోషంగా ఉన్నారని నిలదీసారు. సీఎం చంద్రశేఖర్ రావుకు, ఆయన కుమారుడు కేటీఆర్ కు ఇది న్యాయమా..?అని షర్మిళ ప్రశ్నించారు.

పక్క రాష్ట్రం గురించి ఎందుకు కేటీఆర్ గారు.?

పక్క రాష్ట్రం గురించి ఎందుకు కేటీఆర్ గారు.?

స్వార్థం కోసం అధికారంలోకి వచ్చారని, దరిద్రపు పాలన చేస్తున్నారని గులాబీ ప్రభుత్వంపై షర్మిళ నిప్పులు చెరిగారు. చంద్రశేఖర్ రావు పాలన గొప్పగా ఉందని ఆయన కొడుకు కేటీఆర్ చెప్పుకుంటున్నారని, మీ పాలన ఎలా ఉందో ప్రజలు చెప్తున్న సమస్యలు చూస్తుంటే అర్థం అవుతుందని ఎద్దేవా చేసారు. ప్రజలు అనేక సమస్యల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతుంటే పాలన గొప్పగా ఉందని చెప్పుకోవడానికి సిగ్గుండాలని షర్మిళ ఆగ్రహం వ్యక్తం చేసారు.

కేటీఆర్ కు తెలంగాణలో ఫ్రెండ్స్ తక్కువ..

కేటీఆర్ కు తెలంగాణలో ఫ్రెండ్స్ తక్కువ..

రాష్ట్రం మొత్తం మద్యం ఏరులై పారుతుందని, ఉద్యోగాలు లేక చదువుకున్న బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇదేనా మంచి పాలన.?అంతా దోచుకోవడం, దాచుకోవడం మాత్రవమేనని షర్మిళ మండిపడ్డారు.

చిన్న దొర కేటిఆర్ కి ఆంధ్రలో ఫ్రెండ్స్ ఉన్నారట, ఇక్కడ ఎవరు లేరట., తెలంగాణ లో ఫ్రెండ్స్ ఉంటే మీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో అర్థం అయ్యేదని, తెలంగాణలో ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలు కేటిఆర్ కి ఫ్రెండ్స్ కాదట, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కాదు కాబోలని షర్మిళ ఎద్దేవా చేసారు.

ఇక్కడ స్నేహితులు ఉంటే సమస్యలు తెలుస్తాయి

ఇక్కడ స్నేహితులు ఉంటే సమస్యలు తెలుస్తాయి

కాళ్ళు,చేతులు పోగొట్టుకున్న ఉద్యమ కారులు చాలా బాధ పడుతున్నారని, ఎందుకు ఉద్యమంలో పాల్గొన్నామ అని కుమిలిపోతున్నారని షర్మిళ ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణలో అసలు ఉద్యమకారులను పట్టించుకొనే పరిస్థితులు లేవని, తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే ప్రజలు పడుతున్న ప్రతి బాధలు కేటీఆర్ కు తెలిసేవని,
తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ ఆత్మహత్యలు కేటీఆర్ కంటికి కనిపించేవని షర్మిళ అన్నారు. వడ్లు కొనక రైతులు పడుతున్న బాధలు కూడా కనిపించేవని చమత్కరించారు షర్మిళ.

జగన్ పై కేటీఆర్ విమర్శలు..

జగన్ పై కేటీఆర్ విమర్శలు..

మంత్రి కేటీఆర్ కు తెలంగాణలో ఉన్న స్నేహితుల కన్నా ఆంధ్రాలో స్నేహితులు ఎక్కువగా ఉన్నారని, అందుకే తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకన్నా ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలు కేటీఆర్ కు ఎక్కువగా తెలుస్తున్నాయని షర్మిళ చురకలంటించారు. ఆంధ్రాలో నీళ్లు, కరెంట్, రోడ్ల అంశంలో కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నర్మగర్బంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసారు.

ఏపీ పరిస్థితులతో పనేంటి.?ఇక్కడ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది అనే కోణంలో షర్మిళ స్పందించే ప్రయత్నం చేసారు. పక్క రాష్ట్రంలో ఏంజరుగుతుందో తెలుసుకునే బదులు మన రాష్ట్ర సమస్యలపై దృష్టి సారిస్తే బాగుంటుందనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేసారు షర్మిళ. పక్క రాష్ట్రం అంటే స్వయంగా తన అన్న సీఎం గా ఉన్న రాష్ట్రం.. ఆ రాష్ట్రం గురించి చులకనగా మాట్లాడితే చెల్లిగా షర్మిలకు కోపం రాదా మరి.!

English summary
KTR was asked how reasonable it was to leave the issues here and mention the AP issues. As part of the padayatra, YS Sharmila addressed in Aswarapeta constituency of Bhadradri Kottagudem district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X