వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగరేణి కార్మికుల సమ్మె సైరన్; నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి.. కారణం ఇదే!!

|
Google Oneindia TeluguNews

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణిలో అన్ని కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన 72 గంటల సమ్మె గురువారం నుండి ప్రారంభమైంది. నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మూడు రోజుల సమ్మె ప్రారంభించడంతో తెలంగాణకు చెందిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)లో గురువారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

తెలంగాణాకు కేంద్రం షాక్: సింగరేణి ఆ బ్లాకులలో బొగ్గు అన్వేషణ కోసం 66 కోట్లు ఖర్చు; అయినా వేలం జాబితాలోతెలంగాణాకు కేంద్రం షాక్: సింగరేణి ఆ బ్లాకులలో బొగ్గు అన్వేషణ కోసం 66 కోట్లు ఖర్చు; అయినా వేలం జాబితాలో

సింగరేణి కార్మికుల సమ్మె; 23 భూగర్భ, 19 ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

సింగరేణి కార్మికుల సమ్మె; 23 భూగర్భ, 19 ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

సింగరేణి కార్మికుల సమ్మెలో అత్యధికంగా 42,000 మంది కార్మికులు పాల్గొనడంతో, మొత్తం 23 భూగర్భ మరియు 19 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు వెలికితీత స్తంభించింది. బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు గనుల వద్ద నిరసన చేపట్టారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రధానిని కోరారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)కి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమ్మెకు పిలుపునిచ్చింది. ఐదు కేంద్ర కార్మిక సంఘాలైన ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU), హింద్ మజ్దూర్ సభ (HMS) మరియు భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS)లకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.

 నాలుగు బొగ్గు బ్లాకుల వేలానికి కేంద్రం రెడీ.. 72 గంటల సమ్మెతో కార్మికుల ఢీ

నాలుగు బొగ్గు బ్లాకుల వేలానికి కేంద్రం రెడీ.. 72 గంటల సమ్మెతో కార్మికుల ఢీ

బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క వాణిజ్య బొగ్గు గనుల వేలం జాబితా నుండి సింగరేణి కాలరీస్ కు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను తొలగించడంతోపాటు ఐదు పాయింట్ల చార్టర్ డిమాండ్ల కోసం ఒత్తిడి చేయడానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చింది. ఐదు కార్మిక సంఘాలు కూడా 12 పాయింట్ల డిమాండ్ల చార్టర్ కోసం ఒత్తిడి చేయాలని యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించాయి.
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ బ్లాక్‌-3, ఆసిఫాబాద్‌ జిల్లాలోని శ్రావణపల్లి ఓపెన్‌ కాస్ట్‌ బ్లాక్‌-3, భద్రాద్రి కొత్తగూడెంలోని కోయగూడెం ఓపెన్‌కాస్ట్‌ బ్లాక్‌-3, మంచిర్యాల జిల్లాలోని కళ్యాణఖని అండర్‌గ్రౌండ్‌ బ్లాక్‌-6లను వేలం వేయాలని బొగ్గు శాఖ ప్రతిపాదించింది.వేలానికి టెండర్లు పిలిచే ప్రక్రియకు కేంద్రం ముందుకు వెళితే నిరవధిక సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

బొగ్గు బ్లాకుల వేలం నిలిపివెయ్యాలని సీఎం కేసీఆర్ మోడీకి లేఖ

బొగ్గు బ్లాకుల వేలం నిలిపివెయ్యాలని సీఎం కేసీఆర్ మోడీకి లేఖ

ఇదిలా ఉంటే ఎస్‌సిసిఎల్‌కు చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రతి సంవత్సరం 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని థర్మల్ పవర్ ప్లాంట్ల అవసరాలను తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత 2014లో తెలంగాణలో గరిష్టంగా 5,661 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగిందని, థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.

సమ్మె ప్రభావంతో సింగరేణికి నష్టం

సమ్మె ప్రభావంతో సింగరేణికి నష్టం


సమ్మె ప్రభావంతో సింగరేణిలో మొత్తంగా ఒక్క రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతుంది. అలాగే సంస్థకు 53 వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందని అంచనా. ఇక కార్మికులకు ఒక్కరోజు వేతనం 20 కోట్లకు పైగా నష్టం జరుగుతుందని తెలుస్తుంది. మొదటిరోజు సమ్మె ప్రభావంతో భూగర్భ బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనులు నిర్మానుష్యంగా మారాయి. ప్రజా ప్రతినిధులు సమ్మెకు మద్దతు తెలపడంతో కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. కార్మిక లోకానికి ద్రోహం చేయడానికి నిర్ణయించిన ప్రజాప్రతినిధులకు వచ్చేఎన్నికలలో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ రోజు సమ్మె కారణంగా గోదావరిఖనిలో భారీ ఊరేగింపులు, జిఎం కార్యాలయంముందు బైఠాయింపులు, ధర్నాలు కొనసాగుతున్నాయి.

English summary
Singareni workers strike continues to protest privatization of coal blocks. Concerns continued under the auspices of workers unions at all coal mines today as part of the 72-hour strike. As a result, coal production hit in Singareni
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X