• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పకడ్బందీ వ్యూహంతోనే రవితేజ: న్యాయవాదుల సలహలు, ఆ కారే ఎందుకంటే?

By Narsimha
|

హైదరాబాద్: సిట్ విచారణకు పకడ్బందీ ప్లాన్‌తోనే టాలీవుడ్ సినీ నటుడు రవితేజ హజరయ్యారు. గురువారం నుండి ఆయన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాత్రంతా ఓ స్టార్‌హోటల్‌లో న్యాయవాదుల సలహలను తీసుకొన్నారని సమాచారం.

ఎవరా ఇద్దరు?: సిట్‌కు ముమైత్, పూరీతో చెడిందా?

డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్‌ తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తి సినీనటుడు రవితేజ అని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. రవితేజ వద్ద కీలక సమాచారాన్ని రాబట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు వారు కూడ విచారణ తేదిలను మార్చారు.

పర్సనల్ విషయాలు మీకెందుకు?: సిట్‌కు చార్మి కౌంటర్

అయితే సిట్ అధికారులకు వ్యూహలకు రవితేజ కూడ ప్రతి వ్యూహన్ని రచించారు. సిట్ అధికారుల ప్రశ్నలకు ఏ రకంగా సమాధానాలు ఇవ్వాలనే దానిపై కూడ ఆయన శిక్షణ తీసుకొన్నారనే ప్రచారం కూడ ఎక్సైజ్ వర్గాల్లో ఉంది.

కెల్విన్ ఎలా పరిచయం: చార్మికి సిట్ ప్రశ్నల వర్షం?

దీనికి అనుగుణంగానే సిట్ అధికారులు ప్రశ్నావళిని తయారుచేసి ఆయనను ప్రశ్నిస్తారు.ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు.రవితేజ విచారణతో సినీ ప్రముఖుల తొలివిడత దర్యాప్తు పూర్తయ్యే అవకాశం ఉందని సిట్ అధికారులు అభిప్రాయతో ఉన్నారు.

రాత్రంతా స్టార్ హోటల్‌లోనే

రాత్రంతా స్టార్ హోటల్‌లోనే

రాత్రంతా స్టార్‌హోటల్‌లోనే టాలీవుడ్ సినీ నటుడు రవితేజ గడిపారు. సిట్ విచారణను ఎదుర్కొనేందుకు ఏ రకమైన వ్యూహన్ని అనుసరించాలనే దానిపైనే ఆయన న్యాయవాదుల సలహలను సూచలను తీసుకొన్నారు. సిట్ విచారణ ఎలా ఉంటుంది. ఏ రకమైన ప్రశ్నలను అధికారులు సంధించనున్నారు. ఏ రకంగా సమాధానాలను చెప్పాలనే విషయాలపై కేంద్రీకరించారు. లీగల్‌గా ఇబ్బందులు ఎదురుకాకుండా ఎలా ఉండాలనే విషయాలపై కీలకంగా చర్చించినట్టు ప్రచారం సాగుతోంది.

  Ravi Teja Skipped His Brother Bharat's Funeral? Find out the Facts | Filmibeat Telugu
  నిర్మాత బుజ్జి కారులో సిట్ కార్యాలయానికి

  నిర్మాత బుజ్జి కారులో సిట్ కార్యాలయానికి

  సిట్ కార్యాలయానికి హీరో రవితేజ నిర్మాత నల్లమలుపు బుజ్జి కారులో వచ్చారు. అయితే వ్యూహత్మకంగానే ఆయన కారును మార్చారని ఆయన అభిమానులు అంటున్నారు. మీడియా దృష్టిని మరల్చేందుకుగాను ఆయన ఈ కారును ఉపయోగించారని చెబుతున్నారు. సిట్ కార్యాలయానికి ఎలాగో చేరాల్సి ఉంది. అయితే కారును మీడియా ప్రతినిధులు ఫాలో కాకుండా ఉండేందుకుగాను ఆయన కారును మార్చారని రవితేజ అభిమానులు అంటున్నారు.

  మెట్లాక్కాలా.... లిఫ్ట్ పనిచేస్తోంది

  మెట్లాక్కాలా.... లిఫ్ట్ పనిచేస్తోంది

  అయితే 9 రోజులుగా సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం వచ్చిన సినీ హీరో రవితేజ మెట్లక్కాలా....లిఫ్ట్ పనిచేస్తోందా అని అడిగాడు. అయితే లిఫ్ట్ పనిచేస్తోందని అధికారి చెప్పడంతో కుడివైపున ఉన్న లిఫ్ట్‌లోకి వెళ్ళి ఆయన సిట్ అధికారుల వద్దకు చేరుకొన్నారు. పూరీ జగన్నాథ్, చార్మీ తదితరులు విచారణకు హజరైన సమయంలో లిఫ్ట్ పనిచేసింది. అయితే నవదీప్, తరుణ్, ముమైత్‌ఖాన్‌లు విచారణకు వచ్చిన సమయంలో లిఫ్ట్ పనిచేయలేదని ఎక్సైజ్ వర్గాలు అంటున్నాయి. రవితేజ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకొన్న సమయంలో లిఫ్ట్ పనిచేస్తోన్నందున ఆయన నేరుగా లిప్ట్‌ నుండి విచారణ చేసే గదికి చేరుకొన్నారు.

  చార్మి సమాచారంతోనే కమింగ అరెస్టు

  చార్మి సమాచారంతోనే కమింగ అరెస్టు

  డ్రగ్స్ కేసులో నెదర్లాండ్స్ ‌కు చెందిన మైక్ కమింగ‌ను చార్మి ఇచ్చిన సమాచారంతోనే అరెస్ట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. సినీ రంగానికి డిజిటల్ సపోర్ట్ ఇచ్చే సంస్థలను నడుపుతున్న కమింగ డ్రగ్స్ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్నారని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.ఈ మేరకు కమింగ గురించి పక్కా సమాచారం తెలుసుకొన్న మీదటనే ఆయనను అరెస్ట్ చేశారు. అయితే కమింగను మరోసారి విచారించేందుకు రంగం సిద్తం చేస్తున్నారు. అయితే సినీ ప్రముఖుల పేర్లు మరిన్ని బయటకు వచ్చే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది.

  6 చలాన్లు పెండింగ్‌లో

  6 చలాన్లు పెండింగ్‌లో

  నిర్మాత నల్లమలుపు బుజ్జి పేరున ఉన్న( టీఎస్ 09 ఈఎల్ 3334) కారులోనే రవితేజ సిట్ కార్యాలయానికి వచ్చారు. అయితే ఈ కారుపై ఏడాది వ్యవధిలో ఆరు పోలీస్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఓవర్‌స్పీడ్‌తో పాటు ఎక్కడబడితే అక్కడే రాంగ్ రూట్‌లో కారు పార్కింగ్ చేయడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ కారు నడపడం వంటి వాటిపై చలాన్లు ఉన్నాయి. సుమారు. రూ.2175 జరిమానాను చెల్లించాల్సి ఉంది.

  English summary
  Tollywood actor Ravi Teja appeared before SIT Interrogation on Friday morning.Thursday night he took advice from with his advocates.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X