• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

TPCC New chief ఆయనే..నేడో రేపో ఉత్తర్వులు..!! ఆశావాహులకు పదువులు..ఇలా..!!

By Lekhaka
|

ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుత పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాక ఎన్నికల్లో పరాజయం వెంటనే న పదవికి రాజీనామా చేసారు. అయితే, అప్పటి నుండి కొత్త సారధి ఎంపిక పైన చర్చ సాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డికి ఖాయమని...జీవన్ రెడ్డి పేరు ఖరారైందని ఇలా అనేక ప్రచారాలు సాగాయి. నాగార్జున సాగర ఉప ఎన్నిక ముగిసిన తరువాత నూతన పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుందని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ చెబుతూ వచ్చారు.

 రేవంత్‌కే పగ్గాలు..?

రేవంత్‌కే పగ్గాలు..?

తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలు... బీజేపీ వైపే టీఆర్ఎస్ నుండి బయటకు వస్తున్న నేతలు ఆసక్తి చూపిస్తుండటంతో ఇక త్వరగా పీసీసీ చీఫ్ నియమించాలని ఏఐసీసీ అధినేత్రి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా.. టీపీసీసీకి నూతన అధ్యక్ష నియామక ప్రక్రియ లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడితో పాటుగా ఇతర కీలక పదువుకుల పేర్లు ప్రతిపాదిస్తూ అధినేత్రికి పార్టీ నోట్ ఆమోదం కోసం పంపినట్లుగా సమాచారం. పీసీసీ చీఫ్ కోసం అయిదు పేర్లు ప్రతిపాదించారు. అందులో రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్‌, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌ అలీ పేర్లను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డికే పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

 సీనియర్లకు ప్రాధాన్యత

సీనియర్లకు ప్రాధాన్యత

వీహెచ్ లాంటి నేతలు రేవంత్ కు టీపీసీసీ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్న..ఏఐసీసీ సీరియస్ గా తీసుకోవటం లేదు. దీంతో..సోనియా సైతం రేవంత్ కే బాధ్యతలు అప్పగించటానికి మొగ్గు చూపుతున్నారని ఏఐసీసీ నేతల నుండి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులకు సమాచారం అందింది. అదే సమయంలో పార్టీలో సీనియర్లుగా ఉన్న వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చేలా పదవులు ఖరారు చేస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా అధికారికంగా ఖరారు చేస్తే..సీనియర్ నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

 రేవంత్ ను ఎంపిక చేస్తే

రేవంత్ ను ఎంపిక చేస్తే

రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ఎంపిక చేస్తే ఇతర సీనియర్లు అయిన జీవన్‌రెడ్డి ని కార్యనిర్వహక అధ్యక్షుడిగా.. మధుయాష్కీని ప్రచార కమిటీ ఛైర్మన్లుగా నియమిస్తారని చెబుతున్నారు. ఇక, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కు కీలక పదవి ఇస్తారని చెబుతున్నారు. అయితే, పీసీసీ చీఫ్ కోసం చివరి దాకా పోటీలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డికి మద్దతిస్తున్నారు. కోమటిరెడ్డికి ఏఐసీసీలో పదవి ఇవ్వాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే, చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా..ఈ పేర్లతో టీపీసీసీ లిస్టు కు సోనియా ఆమోద ముద్ర లాంఛనమే అని చెబుతున్నారు. ఈ రోజు లేదా రేపు అధికారికంగా ప్రకటన విడుదల అవుతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

  TPCC Chief: పక్కకు వెళ్లి మాట్లాడుకున్న Revanth Reddy - Komati Reddy పదవి ఎవరికి దక్కినా ?
  English summary
  TPCC new chief may appoint to day or tommarow by AICC chief Sonia. As per sources Revanth reddy name as new chief and senior leaders also give key responsibilities in party at same time.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X