వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఎస్‌పిఎస్సీ గ్రూప్ పరీక్షలు: 1969 తెంగాణ ఉద్యమం

By Pratap
|
Google Oneindia TeluguNews

1948లో పోలీస్‌ యాక్షన్‌ తర్వాత 1952లో సాధారణ ఎన్నికు జరిగి ప్రభుత్వం ఏర్పడే వరకు హైదరాబాద్‌ రాష్ట్ర పాలనా యంత్రాంగం మిలిటరీ, సివిల్‌ అధికారు పాలనలో ఉండటం వల్ల ఆంధ్ర నుంచి వలసలు నిరాటకంగా కొనసాగాయి. అదివరకే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటీష్‌ వారి క్రింద శిక్షణ పొంది అనుభవం ఉన్న ఆ అధికారులను తెలంగాణకు రప్పించుకున్నారు. తెలంగాణ వారికి ఇంగ్లీష్‌ రాదన్న సాకుతో కూడా ఆంధ్రా ప్రాంతం వారిని విచక్షణారహితంగా నియమించారు. తెలంగాణలో సెటిలైన ఆంధ్రా వాళ్లు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ బంధువులను, స్నేహితులను కూడా రప్పించుకొని వారిని ఉద్యోగాల్లో పెట్టారు. అప్పటికే హైదరాబాద్‌ రాష్ట్రంలో ముల్కీ నిబంధనలు అమల్లో ఉన్నా వాటన్నింటిని నిర్లక్ష్యం చేసి దొంగ ముల్కీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలో చొరబడ్డారు. 1956లో ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైన తర్వాత వలసలు మరింత పెరిగాయి.

స్థానికులకు కేటాయించిన ఉద్యోగాలు స్థానికేతరుల పరమవుతూ వచ్చాయి. పెద్ద మనుషుల ఒప్పందాలను గాలికొదిలేశారు. దీనిపై అప్పటికే తెలంగాణ ప్రజలు రగిలిపోయి ఉండటంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నిప్పు రాజుకుంది. ఖమ్మం జిల్లా ప్వాంచలోని థర్మల్‌ స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగుల్లో మెజార్టీ ఉద్యోగలు ఆంధ్ర ప్రాంతం వారు కావడంతో 1969 జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు. అప్పటి ఉద్యమ ప్రారంభానికి పాల్వంచనే పాదు వేసింది. జనవరి 10 నుంచి నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు.

తెలంగాణ రక్షణలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దినసరి వేతన కార్మిక నాయకుడు కృష్ణ నిరాహార దీక్షకు దిగాడు. దీంతో ఉద్యమం జిల్లా కేంద్రం ఖమ్మం పట్టణానికి పాకింది. జనవరి 9న పట్టణంలో బి.ఎ. స్టూడెంట్‌, నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకుడైన రవీంధ్రనాథ్‌ గాంధీచౌక్‌ దగ్గర నిరవధిక దీక్ష ప్రారంభించాడు. అతనితో పాటు ఖమ్మం మున్సిపాల్టీ ఉపాధ్యక్షుడు, కవి అయిన శ్రీకవిరాజమూర్తి కూడా నిరాహారదీక్షలో పాల్గన్నారు.

TSPSC group exams: 1969 Telangana movement

‘‘తెలంగాణ రక్షణ సమితి'' పేరుతో సంస్థను స్థాపించి తెలంగాణ అభివృద్ధి కోసం వంద కోట్లు ఖర్చు చేయాలని, పోచంపాడు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణకు ప్రాముఖ్యత ఇవ్వాలని, తెలంగాణేతర ఉద్యోగుల్ని వెనక్కి పంపి ఆ స్థానాల్లో తెలంగాణ నిరుద్యోగులను నింపాలని తీర్మానాలు చేశారు. ఆ మరునాడు అంటే జనవరి 10న ఉద్యమం నిజామాబాద్‌కు పాకింది. ఉద్యమంలోకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు చేరారు.

జనవరి 13న ఉస్మానియా యూనివర్సిటీలో ‘‘తెంగాణ విద్యార్ధుల కార్యాచరణ సమితి'' ఏర్పడిరది. ఆ రోజు మొట్టమొదటి సారిగా ప్రత్యేక తెంగాణ సాధనను తమ లక్ష్యంగా విద్యార్థులు ప్రకటించుకున్నారు. విద్యార్ధుల కార్యాచరణ సమితి మెడికల్‌ విద్యార్ధి మల్లిఖార్జున్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. విద్యార్ధులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాని మల్లిఖార్జున్‌ పిలుపునిచ్చారు. జనవరి 13న నగర ప్రముఖులందరు ఒక సమావేశం ఏర్పాటు చేసి ‘‘తెలంగాణ పరిరక్షణ కమిటీ''ని స్థాపించారు. విద్యార్ధులకు పూర్తి మద్దతును ప్రకటించారు. జనవరి 20న శంషాబాద్‌లో పాఠశాల విద్యార్ధుపై తొలిసారిగా కాల్పులు జరిపారు.

ఉద్యమ ఉధృతిని గమనించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మిగుల నిధు లెక్కలు తేల్చాలని జస్టిస్‌ భార్గవ అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. జనవరి 22న తెలంగాణ రక్షణలను అమలు చేయడానికి ప్రభుత్వం జి.వో జారీ చేసింది. ఫిబ్రవరి 28లోగా నాన్‌ ముల్కీ ఉద్యోగును వాపస్‌ పంపిస్తామని, జి.వోను నిర్లక్ష్యం చేసే అధికారుపై చర్యు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. జనవరి 24న సదాశివపేటలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 17 ఏళ్ల శంకర్‌ మరుసటి రోజు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 1969 తెంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్‌.

కాల్పులకు నిరసనగా కొండా క్ష్మణ్‌ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్‌ సమితిని ఏర్పాటు చేశారు. జూన్‌ 4న తెంగాణలో పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హైదరాబాద్‌ నగరానికి వచ్చి విద్యార్ధి నాయకులు, తెలంగాణ ప్రజా సమితి నాయకులతో చర్చలు జరిపింది. దాదాపు ఏడాది పాటు తెలంగాణ ఉద్యమం యుద్ధభూమిని తలపించింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయి. మొత్తం 95 సార్లు కాల్పులు జరిగాయి. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో కర్ఫ్యూ విధించారు.

ఉద్యమంలో 369 మంది చనిపోగా, ప్రభుత్వ లెక్కలు మాత్రం 57 మంది చనిపోయినట్టుగా చెప్పాయి. తెలంగాణ ప్రజా సమితి నేతతో కేంద్రం చర్చలు జరిపింది. సెప్టెంబర్‌లో చెన్నారెడ్డి ఢిల్లీలో చర్చలు జరిపి వచ్చిన తర్వాత విద్యార్ధులు తరగతులకు హాజరు కావాలని చెన్నారెడ్డి, విద్యార్ధి నాయకుడు మల్లికార్జున్‌ ఒక ప్రకటన చేశారు. చదువులు కొనసాగిస్తూనే ఉద్యమంలో పాల్గొనాని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా ఉద్యోగులను, విద్యార్ధును ఉద్యమం నుంచి పక్కకు తప్పించారు.

English summary
Telangana 1969 movement started at Palvanch in Khamamm district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X